శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా దివస్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించి, సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహానికి ఘన నివాళి అర్పించిన పోలీసు అధికారులు సిబ్బంది.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల అక్టోబర్ 31 (ప్రజా మంటలు )
శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు, శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటోకు పూలమాలవేసి నివాళులర్పించారు.
రాష్ట్రీయ ఏక్తా దివస్ ని పురస్కరించుకుని ఎస్పీ ఆద్వర్యంలో రాస్ట్రియ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయటం జరిగింది.
ఈ ప్రతిజ్ఞలో భాగంగా మన దేశం యొక్క ఐక్యతను, సమగ్రతను మరియు భద్రత ను కాపాడటానికి నన్ను నేను అంకితం చేస్తున్నానని మరియు నా తోటి ప్రజల్లోకి ఈ సందేశాన్ని పంపియటానికి నా వంతు కృషి చేస్తున్నానని ప్రమాణం చేయటం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… సర్దార్ వల్లభ్ భాయి పటేల్ గారి యొక్క దూరదృష్టి మరియు చర్యల ద్వారా దేశ ఐక్యత సాద్యమైందని ఈ ఐక్యత స్ఫూర్తి తో మన దేశం యొక్క అంతర్గత భద్రత ను కాపాడటానికి మన వంతు భాద్యతను నిర్వహించాలని అన్నారు.
జాతి సమైక్యతకు పునరంకితమై మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర సమరయోధులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ బి ఇన్స్పెక్టర్ అరీఫ్ అలీ ఖాన్, ఆర్.ఐ. వేణు, ఆర్ ఎస్ ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.