రేవ్ పార్టీ పేర సామాజిక మాధ్యమాలు, మీడియాలో అన్ని రూమర్లె - మద్దూరి విజయ్ విడియో
రేవ్ పార్టీ పేర కేటీఆర్ ను నన్ను బద్నాం చేస్తున్నారు. మద్దూరి విజయ్ ప్రకటన
రేవ్ పార్టీ పేర సామాజిక మాధ్యమాలు, మీడియాలో అన్ని రూమర్లె - మద్దూరి విజయ్ విడియో
హైదరాబాద్ అక్టోబర్ 28:
నా పేరుతో సామాజిక మాధ్యమాలు మీడియాలో అనేక రకాల రూమర్లు వస్తున్నాయి,నా పేరుతో ఎఫైర్ లో పెట్టిన ప్రతి వాక్యం తప్పే ... నా వాదన చాలా స్పష్టంగా చెప్పుతున్నానని మద్దూరి విజయ్ వీడియో ప్రకటన జారీ చేసారు.
ఎఫ్ఐఆర్ పేరుతో చేస్తున్న ప్రచారం అంతా తప్పే. నేను చెప్పని మాటలు కూడా చెప్పినట్లు ఎఫ్ఐఆర్లో రాశారు. నేను ఒక అమెరికన్ సిటిజెన్ మాత్రమే కాకుండా పెట్టుబడిదారుగా అనేక దేశాల్లో క్లీన్ రికార్డుతో వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తిని. నేను ఈ మధ్యనే విదేశాలు వెళ్లి వచ్చాను.. దానికి సంబంధించిన ఋజువులను కూడా చూపించానని తెలిపారు.
ఇండియా లో నేను ఎలాంటి ఇల్లీగల్ పదార్థాలు సేవించలేదు. నా మిత్రుడు రాజ్ పాకాల తమ ఫ్యామిలీ ఫంక్షన్ కి దీవాలి పార్టీ కోసం ఆహ్వానించారు, నా కుటుంబంతో ఆ ఫంక్షన్ కి హాజరయ్యాను.ఆ ఫంక్షన్లో చిన్న పిల్లలతో సహా మహిళలు వృద్ధులు కూడా ఉన్నారు
అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగలేదు... పోలీసులు చేస్తున్న ఆరోపణలతో తీవ్రంగా ఆవేదనకు గురవుతున్నాం. ఇది చాలా తప్పు , ఇది నా కుటుంబంతోపాటు నా స్నేహితులకు కుటుంబ సభ్యులకు బంధువులకు తీవ్ర ఆవేదన కలిగిస్తుంది
25 ఏళ్ల మచ్చలేని కెరియర్ను ఒక్క ఆరోపణతో మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.