కామన్ స్కూల్ విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలుపరచాలి. - టి.పి.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు) :
ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులకు టీచర్ ఎమ్మెల్సీ లో ఓటు హక్కు కల్పించాలి.
టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్ డిమాండ్
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్)3వ జనరల్ కౌన్సిల్ సమావేశం స్థానిక డి సి ఈ బి కార్యాలయంలో, జగిత్యాల జిల్లా టీపీటీఎఫ్ అధ్యక్షులు బోగ రమేష్ అధ్యక్షతన నిర్వహించడమైనది.
ఇట్టి సమావేశానికి టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై.అశోక్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ...
గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని,ప్రస్తుత ప్రభుత్వం బదిలీలు,పదోన్నతులు-ఉపాధ్యాయుల నూతన నియామకం మినహాయిస్తే, మిగిలిన అన్ని విషయాల్లో గత ప్రభుత్వము మాదిరిగానే వ్యవహరిస్తోందని,5 డి.ఏ.లు పెండింగ్ లో ఉండగా ఒక్క డి.ఏ.మాత్రమే మంజూరు చేసిన తీరు ఉద్యోగ-ఉపాధ్యాయులను తీవ్ర నిరాశ-నిస్పృహలకు గురిచేసిందని,ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగానే ఉద్యోగ-ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని,సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఒకే విధమైన విద్య కావాలని,అది కామన్ స్కూల్ విద్యా విధానం ద్వారానే సాధ్యమవుతుందని,ప్రాథమిక తరగతులలో మాతృభాషలో విద్య ఉండాలని, ప్రాథమిక తరగతుల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించి,మౌలిక వసతులు కల్పించాలని, ప్రాథమిక తరగతుల్లో కూడా ఆటల కొరకు పి ఈ టి టీచర్ ను నియమించాలని తద్వారా సమసమాజ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించాలని, దానికి కావాల్సిన చట్ట సవరణ కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇట్టి జనరల్ కౌన్సిల్ సమావేశంలో టి పి టి ఎఫ్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టి పి టి ఎఫ్ జగిత్యాల జిల్లా కార్యవర్గం అధ్యక్షులుగా కొక్కుల రామచంద్రం, ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల గోవర్ధన్, ఉపాధ్యక్షులుగా సిహెచ్ వి సత్య ప్రకాష్, సిహెచ్ సత్యం, గండి రాజయ్య, ఎలిగేటి సంజీవరాణి,కూరగాయల చంద్రశేఖర్,చింత మోహన్ ప్రసాద్ ,రాచమల్ల మహేష్, పాక కుమారస్వామి,జిల్లా కార్యదర్శులుగా పి రాజనర్సయ్య,వేముల సుధాకర్, పొన్నం శ్రీనివాస్, పిన్నంశెట్టి శివరంజని, గుడిసె రమేష్, కాచర్ల నాగరాజు, ఎక్కలదేవి రవి, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా బి సత్యస్వామి, సభ్యులుగా ఆర్మూర్ భీమరాజు,ఏ.రాజ మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులుగా లావుడ్య రాజయ్య ,ఎండి ఫక్రుద్దీన్,ఎల్ మంజుల, రాష్ట్ర కౌన్సిలర్లుగా కొలుగూరి కిషన్ రావు,బోగ రమేష్,గొడుగు రఘుపతి యాదవ్,పి కల్పన తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇట్టి ఎన్నికలకు అధికారిగా రాష్ట్ర కార్యదర్శి గుంటి ఎల్లయ్య,పరిశీలకులుగా లక్ష్మయ్య యాదవ్ లు వ్యవహరించారు.
ఇట్టి కార్యక్రమంలో సీనియర్ ఫెడరేషన్ నాయకులు సూద రాజేందర్,నాగేంద్రం,రవీందర్ వివిధ మండలాల బాధ్యులు చిర్నేని రాజిరెడ్డి,కొత్త రాంకుమార్,గొడుగు మధుసూదన్,కడారి ప్రకాష్ ,ఆసం శ్రీనివాస్,గజ్జల లచ్చయ్య, ఐల రఘుపతి,గొల్లపల్లి సత్యనారాయణ, సంతోష్ కుమార్, శ్రీనివాస్, తిరుపతి కందుకూరి శ్రీనివాస్, వెంకటరమణారెడ్డి, వహీద్, సలాముద్దీన్, సిరికొండ వేణు, జి చంద్రమౌళి,గంగారాం,రాజేశం మహిళా ఉపాధ్యాయులు వనిత,, మంజుల, సునీత ,సంజీవరాణి, శివరంజని ,పప్పీరాణి,శ్రీలత తదితరులు పాల్గొన్నారు.