పండుగ ముగిసింది పాచి మిగిలింది.
పాచి మున్సిపాలిటీ సిబ్బందిచే డంపింగ్ యార్డ్ పాలు.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9348422113/9963349493).
జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు) :
దీపావళి పండుగ నరక చతుర్దశి పేరిట మూడు రోజులపాటు ఘనంగా పండుగ నిర్వహించుకుంటాము.
మొదటిరోజు మంగళహారతులు, మంగళ స్నానాలతో ప్రారంభమై రెండవ రోజు అమావాస్య ,ధనలక్ష్మి పూజలు, వ్యాపార సంస్థలు ఖాతా పూజలు మూడో రోజు యమ ద్వితీయ పేరిట (భగినీ హస్తభోజనం ) పేరిట సోదరులు అక్కచెల్లెళ్ల ఇండ్లకు భోజనానికి వెళ్లే కార్యక్రమంతో దీపావళి ముగుస్తుంది.
దీపావళి సందర్భంగా వ్యాపార సంస్థలు శుభ్రం చేసి పనికిరాని చెత్తంతా రోడ్లపై పోయడం వ్యాపార సంస్థలకు దిష్టి కోసం కట్టే గుమ్మడికాయలు పాతవి తొలగించి బయటవేయడం, రోడ్లపై టపాసులు పేల్చడం కాగితాల తుక్కు, వ్యాపార సంస్థలకు కట్టిన పాత గుమ్మడికాయ తుక్కు, అంతేకాకుండా పూజల కోసం బంతిపూలను భారీ సంఖ్యలో అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి.
పూలు అమ్మే వ్యాపారస్తులు దీపావళి సందర్భంగా పెద్ద మొత్తంలో పూల వ్యాపారం కొనసాగుతుంది.
కస్టమర్ కు అమ్మే ధర విషయంలో *"తగ్గేదే"* *లేదు* అన్నట్లు వ్యవహరించి పూల వ్యాపారం కొనసాగిస్తారు. పండుగ పూర్తి అయిన తర్వాత మిగిలిపోయిన పూలను పూలమ్మిన స్థలంలోనే వదిలి వెళ్ళిపోతారు.
ఈ పాపాన్ని భరించాల్సింది మున్సిపల్ సిబ్బంది.
మూడు రోజుల పండుగ పాచిని శుభ్రం చేయడానికి మూడు రోజులు పడుతుంది.
పండుగ ముగిసిన పాచి మాత్రం మిగిలిపోవడం ఒక్కింత మున్సిపల్ సిబ్బందికి ఇబ్బందికరమే.