IMA స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ గా గెలుపొందిన డా. వేణుగోపాల్ రెడ్డి

On
 IMA స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ గా గెలుపొందిన డా. వేణుగోపాల్ రెడ్డి

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల 10 నవంబర్ (ప్రజా మంటలు) : 

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ వారు నిర్వహించిన ఎన్నికలలో జగిత్యాల పట్టణానికి చెందిన డా. వేణుగోపాల్ రెడ్డి పిల్లల నిపుణులు IMA స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ గా గెలుపొందినట్లు తెలంగాణ IMA సభ్యులు తెలిపారు.

తెలంగాణ లో నిర్వహించిన ఎన్నికలలో ఇండియన్ మెడికల్ అసోసయేషన్ వర్కింగ్ కమిటీ మెంబర్ గా గెలుపొందిన శుభ సందర్భంగా జగిత్యాల పట్టణ డాక్టర్స్ శుభాకాంక్షలు తెలిపారు.

గతంలో జగిత్యాల పట్టణ IMA ప్రెసిడెంట్, సేక్రెటరీగా చాలా మంచిగా పని చేశారని డా.వేణుగోపాల్ రెడ్డి ని కొనియాడారు.

Tags