తెలంగాణలో ఇంటింటి సర్వే, గురించి అబూ దాబీ లో అవగహన 

On
తెలంగాణలో ఇంటింటి సర్వే, గురించి అబూ దాబీ లో అవగహన 

తెలంగాణలో ఇంటింటి సర్వే, గురించి అబూదాబీ లో అవగహన 

హైదరాబాద్ నవంబర్ 09:

 తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రారంభం అయ్యింది. తెలంగాణకు 
చెందిన సుమారు 15 లక్షల మంది ప్రవాసి కార్మికులు గల్ఫ్ తదితర దేశాలలో నివసిస్తున్నట్లు ఒక అంచనా. ఈ సర్వేతో ఖచ్చితమైన గల్ఫ్ కార్మికుల సంఖ్య ఎంతో తేలిపోతుంది. అని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ యూఏఈ దుబాయ్ అధ్యక్షులు బత్తిని రాజా గౌడ్. అన్నారు.

విదేశాలకు వలస వెళ్లారని చెబితే... రేషన్ కార్డుల్లో పేర్లు తీసేస్తారా?
*రైతు బంధు, రైతు బీమా వర్తించదా? ఇతర సంక్షేమ పథకాలు వర్తించవా? అనే కార్మికుల సందేహాలపై, రాజా గౌడ్ ఆబుదాబిలో అవగాహన కల్పించారు.

రాజా గౌడ్ మాట్లాడుతూ,
తెలంగాణ ప్రభుత్వం ఒక సామాజిక ఆశయంతో సర్వే నిర్వహిస్తోంది. ఆ సర్వే ముందుకు సాగకుండా కొంతమంది దుష్ప్రచారానికి తెరలేపారు. ఒక్క విషయం వెరీ క్లియర్... ఈ సర్వేతో రేషన్ కార్డులు తొలగించడాలు, పథకాల నుంచి తొలగించడాలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు.

సర్వే ప్రశ్న నెం. (48) లో వలస వివరాలు అడిగారు. మన కుటుంబం లా నుండి వలస వెళ్ళారా? ఇతర దేశాలు అయితే దేశం పేరు, ఇతర రాష్ట్రాలు అయితే రాష్ట్రం పేరు, వలస వెళ్లడానికి కారణం అనే ప్రశ్నలున్నాయని
రాజా గౌడ్ కార్మికులతో అన్నారు.

మరియూ,గల్ఫ్ దేశాల్లో పనిచేస్తోన్న తెలంగాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది, అని రాజా గౌడ్  అన్నారు.
గల్ఫ్ కార్మికులు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు పరిహారం. 2023 డిసెంబర్ 7 నుంచి చోటు చేసుకున్న ఘటనలకు ఇది వర్తిస్తుంది.
గల్ఫ్ కార్మికుల స్థితిగతుల అధ్యయనానికి అడ్వైజరీ కమిటీ ఏర్పాటు 
 ప్రజా భవన్ లో కొనసాగుతోన్న ప్రజావాణి కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా "ప్రవాసి ప్రజావాణి" కౌంటర్ ఏర్పాటు, ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ల అడ్మిషన్లలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రాధాన్యం.15 లక్షల గల్ఫ్ కార్మికుల తరపునా, రాష్ట్ర ప్రభుత్వం నికీ ధన్యవాదాలు తెలిపిన ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ యూఏఈ దుబాయ్ అధ్యక్షులు బత్తిని రాజా గౌడ్. ఈ కార్యక్రమాల్లో సంజయ్, గంగాధర్, విఘ్నేష్, రావి, నారాయణరెడ్డి, సతోష్, కిరణ్, ప్రవీణ్, శ్రీనివాస్,ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్,మరియూ, గల్ఫ్ జేఏసీ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు,పాల్గొన్నారు.

Tags