తప్పుడు ధ్రువపత్రాలతో భూమి పట్టా చేసుకున్న వైనం! 

తహసిల్దార్ తో సహా 10 మందిపై కేసు నమోదు

On
తప్పుడు ధ్రువపత్రాలతో భూమి పట్టా చేసుకున్న వైనం! 

తప్పుడు ధ్రువపత్రాలతో భూమి పట్టా చేసుకున్న వైనం!  హనుమకొండ జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశాలతో  అప్పటి తహసిల్దార్ తో సహా 10 మందిపై కేసు నమోదు

ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లో పేరు గల్లంతు                               వివరాలు వెల్లడించిన సామల వనమాల

 (కాశిరెడ్డి ఆదిరెడ్డి -99893 26427 )

భీమడేవరపల్లి అక్టోబర్ 21 (ప్రజామంటలు) :

తప్పుడు ధృవపత్రాలతో ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ సృష్టించి కుటుంబ సభ్యులకు తెలియకుండా భూమి పట్టా చేసుకున్న వ్యక్తితో పాటు మరో 9 మంది పై కేసు నమోదయింది. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సామల మల్లాచారి (రిటైర్డ్ ఏ.ఆర్ ఎస్ఐ)  పేరున సర్వే నంబర్ 559అ/3 లో 0-33 గుంటలు, 558ఆ/5 లో 0-21 గుంటల వ్యవసాయ భూమి ఉంది. కాగా  మల్లాచారి భారతి దంపతులకు ఇద్దరు కుమారులు రాజ్ కుమార్, సతీష్ ఉన్నారు. భారతి చనిపోవడంతో మల్లాచారి వనమాలను రెండో వివాహం చేసుకున్నాడు. కాగా నవంబర్ 2022 లో మల్లాచారి మరణించాడు. అనంతరం సామల సతీష్ కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రములో వనమాల పేరు చేర్చకుండా, సోదరుడు రాజ్ కుమార్ కు తెలియకుండా మంగ 33 గుంటల భూమిని విరాసత్ పేరా పట్టా చేసుకున్నాడు. ఈ విషయంపై బాధితురాలు సామల వనమాల కోర్టును ఆశ్రయించగా అప్పుడు భీమదేవరపల్లి డిప్యూటీ తహశీల్దార్, తహశీల్దార్ శివ కుమార్ బాధ్యతల్లో ఉండి నిబంధనలు పాటించకుండా కుటుంబ ధ్రువీకరణ పత్రం జారీ చేసినట్టు వెల్లడైంది. ఈ కేసులో అక్రమంగా పట్టా చేసుకున్న సామల సతీష్ తో పాటు సాక్షులుగా ప్రభుత్వ ఉద్యోగులు ఎండీ రఫీ, బత్తిని తిరుపతి,  కొత్తపల్లి గ్రామస్తులు అయిన సట్ల సతీష్, సల్పాల సురేందర్, రేణికుంట్ల రాజు, కొత్తగట్టు రజనీ కాంత్, సర్టిఫికెట్ జారీ చేసిన తహశీల్దార్ శివకుమార్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని, హనుమకొండ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మల్కనూర్ ఎస్ఐని  ఆదేశించగా అక్టోబర్ 14, వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని సామల వనమల తెలిపారు.

-----------------------------------

 

Tags