హత్య కేసును చేదించిన కోరుట్ల పోలీసు అధికారులు

వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి ఉమామహేశ్వరరావు

On
హత్య కేసును చేదించిన కోరుట్ల పోలీసు అధికారులు

హత్య కేసును చేదించిన కోరుట్ల పోలీసు అధికారులు

అదుపులో ఐదుగురు నిందితులు.. పరారీలో ఒక నిందితుడు

వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి ఉమామహేశ్వరరావు


కోరుట్ల అక్టోబర్ 18 (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్ లో ఆదివారం రాత్రి జరిగిన హత్య కేసులోని నిందితులను కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు బోయిని సాగర్, పంబాల మధు, నరేష్ మధ్య గొడవ జరగగా మృతుడు బోయిని సాగర్ పంబాల నాగరాజు ఇంటి వద్దకు వెళ్లి నానా రచ్చ చేసి ఎప్పటికైనా మధు నరేష్ లను హతమరుస్తానని బెదిరించాడు.

వీళ్ళ మధ్య సయోధ్య కుదుర్చుడానికి వచ్చిన గుద్దేటి వెంకటేష్, గుద్దేటి విజయ్, రాకేష్ లు నాగరాజ్ ఇంటికి వెళ్లి అక్కడ నాగరాజుతో గొడవ పడుతున్న మృతుడు సాగర్ ను వారి ఇంటి నుండి బయటకు గుంజుకొని వచ్చి నాలుగు రోడ్ల కూడలి వద్ద సాగర్ ను నెట్టివేయగా కింద పడిపోయాడు. అప్పుడు,సాగర్ ను గుద్దేటి వెంకటేష్ తన వద్ద గల కత్తితో గొంతు కోసి చంపినాడు. 

అనంతరం సంఘటనస్థలం నుండి నిందితులు పారిపోగా, నిందితుల కోసం కోరుట్ల సి.ఐ సురేష్ బాబు, ఎస్.ఐ శ్రీకాంత్ వారి సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు.

పక్క సమాచారంతో గురువారం ఉదయం కోరుట్ల పట్టణ చివర్లోని వెంకటేష్ కు చెందిన నాగులమ్మ బ్రిక్స్ ఫ్యాక్టరీలో నిందితులు ఉన్నారని తెలియడంతో  కోరుట్ల సీఐ సురేష్ బాబు ఎస్సై శ్రీకాంత్ వారి సిబ్బందితో అక్కడికి వెళ్లి 5గురు నిందితులను అరెస్టు చేసారు 

వారి వద్ద నుండి మృతుడిని చంపడానికి ఉపయోగించిన ఒక కత్తి,రెండు బైకులు, నాలుగు సెల్ఫోన్లను పోలీసులు  స్వాధీన పరుచుకున్నారు. మరో నిందితుడు పంబాల నాగరాజు పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలో పట్టుకుంటామని  అన్నారు.


అలాగే ఈ కేసును తొందరగా చేదించిన అధికారులను మెటుపల్లి డిఎస్పి ఉమామహేశ్వరరావు అభినందించాడు.

Tags