17వ లైబ్రరీని ప్రారంభించిన ఆకర్షణ సతీష్​  - ఆకర్షణను అభినందించిన స్కూల్​ టీచర్లు

25 లైబ్రరీ ఓపెనింగ్​ కు ప్రధాని మోదీ ?

On
17వ లైబ్రరీని ప్రారంభించిన ఆకర్షణ సతీష్​  - ఆకర్షణను అభినందించిన స్కూల్​ టీచర్లు

05A 17వ లైబ్రరీని ప్రారంభించిన ఆకర్షణ సతీష్​                ఆకర్షణను అభినందించిన స్కూల్​ టీచర్లు..              - 05B

 సికింద్రాబాద్ అక్టోబర్​ 17 (ప్రజామంటలు) :                                                         బేగంపేట లోని హైదరాబాద్​ పబ్లిక్​ స్కూల్​ లో 8వ తరగతి చదువుతున్న 13 ఏండ్ల విద్యార్థిని ఆకర్షణ సతీష్​ తన 17వ లైబ్రరీని సిటీలోని నాగారం లోని సెరినిటీ మోడల్​ హైస్కూల్​ లో ప్రారంభించింది. ఈసందర్బంగా తన తరపున 425 కొత్త పుస్తకాలను ఈ కొత్త లైబ్రరీకి అందచేశారు. రాబోవు 2025 మార్చి నాటికి మొత్తం 25 లైబ్రరీలను ఏర్పాటు చేయాలనేది తన లక్ష్యమని ఆకర్షణ మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 17 లైబ్రరీలకు 11 వేల పుస్తకాలను సేకరించి, విరాళంగా ఇచ్చిందన్నారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆకర్షణ కలవగా, మోదీ ఆమెను మనసారా అభినందించారు. నేటి కాలంలో పరులకు జ్ఞానం పంచిపెట్టాలనే చక్కటి గొప్ప ఆలోచన కలిగి ఉన్న  ఆకర్షణ అందరికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఆకర్షణ 25వ లైబ్రరీ ఓపెనింగ్ కు తాను స్వయంగా వస్తానని ప్రధాని మోదీ హామినిచ్చినట్లు ఆకర్షణ తండ్రి సతీష్​ తెలిపారు. తమ మోడల్ స్కూల్​ లో ఆకర్షణ లైబ్రరీని ప్రారంభించి, కొత్త పుస్తకాలను ఇవ్వడం ఆనందంగా ఉందని, స్కూల్​ నిర్వాహకులు తెలిపారు. చిన్న వయస్సులో పరోపకారం చేయడం చాలా గొప్పవిషయమన్నారు. కార్యక్రమంలో స్కూల్​ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

––––––––––––

Tags