జగిత్యాల జిల్లా లో ఆనంద ఉత్సవాల మధ్య సాగిన సీ ఎం కప్ టార్చ్ రిలే ర్యాలి.

On
జగిత్యాల జిల్లా లో ఆనంద ఉత్సవాల మధ్య సాగిన సీ ఎం కప్ టార్చ్ రిలే ర్యాలి.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల 08 అక్టోబర్ (ప్రజా మంటలు) : 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకముగా రాష్ట్ర స్థాయి క్రీడలు మరియు క్రీడా కార్యకలాపాలను తెలంగాణలో క్రింది స్థాయి నుండి తీసుకురావడానికి గ్రామ, మండల మరియు జిల్లా స్థాయి నుండి వివిధ కేటగిరీలలో రాష్ట్రవ్యాప్త ముఖ్యమంత్రి కప్ 2024ను పోటీలకు సంబందించిన క్రీడా జ్యోతి ర్యాలీ స్పోర్ట్స్ అధికారి, అలేగ్జాండర్ అద్వర్యంలో ఈ నెల 3 నుండి రాష్ట్రంలోని జిల్లాలను కలుపుతూ ప్రారంబించిన ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ ర్యాలి జగిత్యాల జిల్లాలోని మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది.

జిల్లా క్రీడల అధికారి డా. కోరుకంటి రవి కుమార్, మునిసిపల్ కమీషనర్ సమ్మయ్య కలిసి ర్యాలిని పొలసలోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి ప్రారంబించారు.

ఈ సందర్భంగా జిల్లా క్రీడల అధికారి డా. కోరుకంటి రవి కుమార్ మాట్లాడుతూ...  ఈ నెల 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలి కొనసాగుతుందని తెలిపారు.

ఈ ర్యాలి ఎస్.కే.ఎన్.ఆర్. ఆర్ట్స్ & P.G. కళాశాల మీదుగా స్వామి వివేకానంద మినీ స్టేడియం జగిత్యాలలో ముగిసింది. 

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతి నిధులు, జిల్లా అధికారులు, క్రీడా సంఘాలు/క్రీడాకారులు, PD/PETలు, విద్యార్థిని విద్యార్థులు, మరియు 200 మంది క్రీడాభిమానులు పాల్గొన్నారు.

Tags