జోష్ నింపిన జగిత్యాల ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల స్పార్కిల్ 2024.

On
జోష్ నింపిన జగిత్యాల ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల స్పార్కిల్ 2024.

(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల సెప్టెంబర్ 22 ( ప్రజా మంటలు ) : 

సాంస్కృతిక కార్యక్రమాలతో నూతన ఉత్సాహం కలుగుతుందని మరియు వివిధ కార్యక్రమాలను చాలా ప్రైవేట్ వేడుక హద్దుగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి జగిత్యాల స్థానిక ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

అంతకు ముందు వారు చదువుల తల్లి సరస్వతి మాత విగ్రహానికి పూల మాల వేసి సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను అట్లహాసంగా ప్రారంభించారు. 

నేడు చాలా మంది విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని మరియు అనుకున్న లక్ష్యాలను చాలా సులభంగా చేదిస్తున్నారని చెప్పారు.

ప్రతి ఒక్కరు తరగతి గదుల్లో చాలా ఉత్తమంగా వ్యవహరించి, శ్రద్దతో, ఏకాగ్రతతో అధ్యాపకులు భోదించే విషయాలను సమగ్రంగా విని విశ్లేషించుకోవాలని కోరారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు కావాల్సిన వనరులను సమకూర్చి వారిని అగ్ర స్థానంలో నిలుపేందుకు ప్రోత్సాహం అందించి సాధించే దిశగా పయనించాలను సూచించారు.

మన దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన విద్యార్థులను అతిధులు చాలా గొప్పగా సన్మానించారు. ముఖ్యంగా తల్లిదండ్రుల వారి పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి లక్ష్యాలను సాధించే విధంగా ప్రేరేపించి ముందంజలో నిలపాలని సూచించారు

ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ప్రిన్సిపాల్, అధ్యాపకలు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags