ప్రజలంతా కులభేదం లేకుండా సమరసతా భావంతో జీవించాలి - అప్పాల ప్రసాద్ జీ
ప్రజలంతా కులభేదం లేకుండా సమరసతా భావంతో జీవించాలి.
ఆధ్యాత్మిక వాతావరణంలో కొండగట్టు గిరి ప్రదక్షిణ.
సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ
కొండగట్టు సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు) : ప్రజలంతా కుల భేదాలు లేకుండా సమరసతాభావంతో జీవించాలని సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం
చిలుకూరు బాలాజీ శివార్చకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో సాగిన
18వ గిరిప్రదక్షిణ కార్యక్రమంలో సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రజలందరూ కుల భేదం లేకుండా సమరసత భావం తో జీవించాలన్నారు. కుటుంబాలలో మన సంస్కృతి,సంప్రదాయాలను నేటి తరానికి నేర్పించే ప్రయత్నం తలిదండ్రులు చేయాలన్నారు. అడవులను పరిరక్షిస్తూ మొక్కలు పెంచుతూ,ప్లాస్టిక్ రహిత వాతావరణం నిర్మాణం చేయాలని కోరారు. దేశభక్తి,దైవ భక్తిని పెంచుకుని సమాజ హితం కోసం పనిచేయాలని, మాతృభాషని రక్షించు కుంటూ, దేవాలయాల కేంద్రంగా భజన,సామూహిక భోజనం, ఇతిహాసాలను తెలిపే సత్సంగ ప్రవచనాలు జరగాలన్నారు.
ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ 15 కిలోమీటర్ల కొండగట్టు గిరి ప్రదక్షిణ లో సుమారు 75 మంది కి పైగా భక్తులు పాల్గొన్నారు.. ఈ గిరి ప్రదక్షిణ లో ఒక కుక్క కూడా భక్తుల తో పాటు 15 కిలోమీటర్లు నడవటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది భగవంతుని కృపా విశేషం గా భక్తులు చెప్పుకున్నారు.ఈ కుక్క గత నాలుగు ఐదు సార్లు గా పౌర్ణమి సందర్బంగా గిరి ప్రదక్షిణ చేస్తున్నట్లు భక్తులు తెలిపారు.