వరంగల్ మహానగరంలో మాయగాడు

సుమారు 29 లక్షల విలువ గల నకిలీ ఎలక్ట్రికల్ వైర్స్ మరియు స్విచ్ లు పట్టివేత

On

వరంగల్ ప్రజామంటలు సెప్టెంబర్ 25 : (కాశిరెడ్డి ఆదిరెడ్డి)

 వరంగల్ మహానగరంలో మాయగాళ్లు అడ్డదారిలో ఎక్కువగా డబ్బులు దండుకునేందుకు ఏకంగా భవన నిర్మాణ రంగం లో వాడే ఎలక్ట్రికల్ వైర్స్ మరియు స్విచ్ లను బ్రాండెడ్ కాంపెనీలు అయినటువంటి POLYCAB, FINOLEX, V- GUARD & ANCHOR కంపెనీల ముసుగులో నకిలివి అమ్ముతున్నారనే పక్క సమాచారం తో టాస్క్ ఫోర్స్ మరియు మిల్స్ కాలనీ పోలీసులు ఆకస్మిక తనిఖి లు చేపట్టగా ఈ నకిలీ వ్యాపారం బయటపడింది. *POLYCAB, FINOLEX, V- GUARD & ANCHOR* కంపెనీలకు చెందిన *(ఎలక్ట్రికల్ వైర్స్ మరియు స్విచ్ లు)* లాంటి నకిలీలను అసలు వాటిగా నమ్మిస్తు, *శ్రీ పార్వతి ఎలక్ట్రికల్స్* యజమాని అయిన *చౌదరి ధనరావు* తండ్రి బాగజీ, వయస్సు: 40 సం||, అండర్ బ్రిడ్జ్, శివ నగర్ లో గల తన షాప్ లో విక్రయిస్తున్నారనే సమాచారంతో ఈ రోజు టాస్క్ ఫోర్స్ మరియు మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్ లో *28,67,762/-* విలువ గల వైర్స్ మరియు స్విచ్ లు గుర్తించి సీజ్‌ చేశారు. దర్యాప్తు లో భాగంగా శ్రీ పార్వతి ఎలక్ట్రికల్స్ యజమాని చౌదరి ధనరావు విచారించగా POLYCAB, FINOLEX, V- GUARD & ANCHOR కంపెనీల వస్తువులు దొంగిలించినట్లు తెలిపారు.

 

Picsart_24-09-25_04-27-09-417

 

Tags