ఇడ్లీ లో ప్రత్యక్షమయిన జెర్రీ  

జగిత్యాలలో ఉడిపి హోటల్‌పై కేసు : మహిళా నిరసనతో చర్యలు.

On
ఇడ్లీ లో ప్రత్యక్షమయిన జెర్రీ   

 

ఇడ్లీ లో ప్రత్యక్షమయిన జెర్రీ

 జగిత్యాలలో ఉడిపి హోటల్‌పై కేసు : మహిళా నిరసనతో చర్యలు.

జగిత్యాల అక్టోబర్ 13 (ప్రజా మంటలు) :

జగిత్యాల పట్టణంలో ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన జిల్లా అంతట ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. గణేష్ భవన్ ఉడిపి హోటల్‌లో ఓ మహిళ ఇడ్లీ ఆర్డర్ చేసి తినే ప్రయత్నంలో దానిలో జెర్రీ కనిపించడం నిర్లక్ష్యానికి నిదర్శనమని, ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆమె హోటల్ ఎదుట ఆందోళనకు దిగింది.

 

ఈ సంఘటన స్థానిక ప్రజలను కలవరపెట్టడంతో పాటు హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అక్టోబర్ 13న ఉదయం దాదాపు పది గంటలకు  ఒక మహిళ తన కుటుంబంతో కలిసి గణేష్ భవన్ ఉడిపి హోటల్‌కుu వచ్చి ఇడ్లీ ఆర్డర్ చేసింది. ఆమె తన చిన్నపిల్లలకు ఆహారం అందించే ప్రయత్నంలో ఇడ్లీలో జెర్రీ కనిపించింది. ఈ ఘటనతో షాక్‌కు గురైన ఆమె హోటల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిర్లక్ష్యం వలన తమ కుటుంబం ఆరోగ్యానికి ముప్పు వాటిల్లిందని ఆరోపించింది. "చిన్నపిల్లలు ఉన్నారు. వారు తింటే పరిస్థితి ఏమిటి?" అంటూ ఆమె హోటల్ యజమానికి ప్రశ్నలు సంధించింది.

 

మహిళా నిరసన చేయడం తో హోటల్ యజమాని సీతారాములు ఆమెకు సమాధానం ఇవ్వాలని ప్రయత్నించాడు. మొదట, జెర్రీ కాదని, అది కేవలం నల్ల దారం వల్ల తలెత్తిన సమస్య అని చెప్పిన యజమాని, తన మాటలకు కట్టుబడి ఉండలేక, ఇడ్లీని తన నోట్లో వేసుకుని చూడటానికి ప్రయత్నించాడు. అయితే, తాను కూడా జెర్రీ అని నిర్ధారించుకున్న తరువాత, హోటల్ యజమాని ఆ ఇడ్లీని ఉమ్మివేశాడు. ఈ చర్యతో అక్కడి ప్రజలు, కస్టమర్లు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు నిరసనకారులు మరియు పోలీస్ చర్యఈ సంఘటన నేపథ్యంలో బాధితురాలు హోటల్ ముందు నేరుగా నిరసన చేపట్టింది. స్థానికులు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా రోడ్డుపై బైఠాయించి, హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు అక్కడి నుంచి వెళ్లబోమని సవాలు చేసింది.

 

ఈ సందర్బంగా హోటల్ యాజమాన్యం ఇడ్లీలను బల్దియా ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, బాధితురాలు మరియు ఇతర ప్రజలు అడ్డుకున్నారు. ఇడ్లీలను రోడ్డు మీదే పారవేసి, ఆరోగ్యంపై ఇలాంటి ప్రమాదాలు రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోటల్ నిర్వహణలో క్లీన్ లైనెస్ మరియు క్వాలిటీ నియంత్రణ పూర్తిగా లేకపోవడంతో, ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు.చట్టపరమైన చర్యలు ఈ సంఘటనపై పట్టణంలోని ప్రజలు, ప్రత్యేకంగా ఆరోగ్యవర్గాలు, హోటల్ యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై వెంటనే స్థానిక మున్సిపల్ అధికారులు మరియు ఆహార సురక్షితత్వ విభాగం స్పందించి, హోటల్‌ను పరిశీలించి, ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించడంలో విఫలమయ్యారని నిర్ధారించారు.

మహిళ చేసిన ఫిర్యాదుతో, పోలీసులు హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. స్థానిక ఆహార మరియు ఆరోగ్య అధికారుల సహకారంతో, హోటల్‌ను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.సమాజంలో స్పందన

ఈ సంఘటన పట్టణంలో విశేష చర్చనీయాంశంగా మారింది. ప్రజలు తమ ఆరోగ్యం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో కలవరం రేకెత్తిస్తున్నాయి. ప్రజలు ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగించే హోటళ్ళపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.మున్ముందు చర్యలుహోటల్స్, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతను నిర్ధారించడానికి కఠినమైన నియమాలు ఉండాలని, వాటిని పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

------------------------------------

Tags