ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ లో 40 మంది వరకు నక్సలైట్లు మృతి - శవాలను బయటకు తీస్తున్న బలగాలు 

On
ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ లో 40 మంది వరకు నక్సలైట్లు మృతి - శవాలను బయటకు తీస్తున్న బలగాలు 

ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ లో 40 మంది వరకు నక్సలైట్లు మృతి - శవాలను బయటకు తీస్తున్న బలగాలు 

భద్రాచలం అక్టోబర్ 05 :

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌-దంతెవాడ జిల్లాల సరిహద్దులో శుక్రవారం మధ్యాహ్నం .12:30 గంటలకు మొదలైన ఎదురుకాల్పుల్లో 40 మంది వరకు నక్సలైట్లు మృతి చెందారనీ తెలిసింది. బస్తర్ అడవుల నుంచి 40 మృతదేహాలను సైనిక బృందం స్వాధీనం చేసుకుందని సమాచారం. 31 మృతదేహాలను దంతెవాడకు, 9 మృతదేహాలను నారాయణపూర్‌కు తరలించారని తెలిసింది. దంతెవాడ-నారాయణపూర్‌ సరిహద్దులో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో CRPF, BSF.  కోబ్రా,  STF విభాగాలకు చెందిన 1500 మంది పాల్గొన్నారనీ సమాచారం

మావో ఇస్టులకు ఇది కోలుకోలేని దెబ్బ, ఇది రెండో అతిపెద్ద ఎన్ కౌంటర్ గా పేర్కొంటున్నారు. 
మృతుల్లో  కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారని తెలుస్తోంది.

Tags