ఒక్కనెలలోనే 48 మంది చిన్నారులు..14 మంది తల్లులు..    గాంధీ ఆస్పత్రిలో చనిపోయారు వార్తపై  -  స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ 

On
ఒక్కనెలలోనే 48 మంది చిన్నారులు..14 మంది తల్లులు..    గాంధీ ఆస్పత్రిలో చనిపోయారు వార్తపై  -   స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ 

ఒక్కనెలలోనే 48 మంది చిన్నారులు..14 మంది తల్లులు.. 
    - *  గాంధీలో చనిపోయారంటూ ఎక్స్​ లో మెసెజ్ వైరల్..​
     *  స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ IMG-20240918-WA0956

సికింద్రాబాద్​, సెప్టెంబర్​ 18 ( ప్రజామంటలు ) :

గాంధీ ఆసుపత్రిలో ఒక్క ఆగస్ట్​ నెలలోనే 48 మంది పసికందులు, 14 మంది తల్లులు చనిపోయారని, దీనికి కారణం ప్రభుత్వం, వైద్యుల నిర్లక్ష్యమే అని అంటూ ఎక్స్​ (ట్విట్టర్​)లో తెలుగు స్క్రయిబ్​ అక్కౌంట్​ లో  బుధవారం ఓ మెసెజ్​ తెగ వైరలైంది. గాంధీలో ట్రీట్మెంట్​ తీసుకుంటూ చనిపోయిన వారి పేర్లు, ఊర్లు, తేదీ, సమయాలతో సహా మెసెజ్​ లో వివరంగా ఉండటంతో సర్వత్రా ఈ విషయమై చర్చ సాగింది. ఈ విషయమం గత 15 రోజులుగా బయటకి పొక్కకుండా తెలంగాణ ప్రభుత్వం దాస్తోందని, ఇదిగో సదరు డేటా అంటూ ఎక్స్​ లో తెలుగు స్ర్కైబ్​ నిర్వాహకులు పెట్టారు. గత సర్కార్​ ఇచ్చిన గర్బిణీ స్ర్తీల పౌష్టికాహారం న్యూ ట్రిషన్​ కిట్లు, పిల్లలకు ఇచ్చే కేసీఆర్​ కిట్లను పంపిణీ ఆపివేయడం వలనే ఈ మృత్యువాతలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఇటీవల బదిలీల పేర సీనియర్​ వైద్యులను జిల్లాలకు పంపించి, ఇక్కడ అనుభవం లేని డాక్టర్లతో  సర్జరీలు చేయిస్తుండటం మరణాలకు ఒక కారణమన్నారు.ఒక్క గాంధీలోనే మరణాల సంఖ్య ఇలా ఉంటే రాష్ర్ట వ్యాప్తంగా సర్కార్ దవఖానల్లో  పరిస్థితి ఎలా ఉందో అని  వాపోయారు. దీంతో పాటు వారు గాంధీలోని పలు అంశాలు, నిర్ణయాలు, వాస్తవ పరిస్థితులపై ఆ మెసెజ్​ లో పేర్కొన్నారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్​ ప్రొఫెసర్​ రాజకుమారిని అడగ్గా, ఆమె స్పందించారు. ఆమె మాటాల్లోనే...
""   కొందరు అనేక ఆరోపణలు చేశారు. ఇదంతా ఒక హైప్​ క్రియట్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో గత కొన్నేండ్లుగా పరిస్థితి ఇలానే ఉంది. ఇది సాదారణం. అన్ని ఆసుపత్రుల్లో ఉండేదే ఇది. ఇక్కడ అబ్​ నార్మల్​ కాదు. పసిపిల్లలు గత నెలలో 48 మంది కాదు 32 మంది చనిపోయారు. గత ఐదేండ్ల మరణాల రేటుతో పోల్చితే కొద్దిగా హెచ్చు, తగ్గులు ఉండటం సహజం. గైనిక్​ డిపార్ట్మెంట్ హెచ్​ఓడీగా అనుభవజ్ఞులైన, సీనియర్​ వైద్య నిపుణులు డా.రాధా ఉన్నారు. మందుల కొరత లేదు. అవసరమైన మందులు కొనుగోలు చేయడానికి , సిబ్బందిని నియమించుకోవడానికి మాకు ప్రభుత్వం నుంచి అనుమతులున్నాయి. సెక్యూరిటీ విషయంలో కొన్ని లోటుపాట్లుఉన్నాయి. వాటిని త్వరలోనే అధిగమిస్తాం. గాంధీకి ఉన్న ప్రతిష్టకు మసకను అంటగట్టవద్దని విజ్ఞప్తి. గాంధీకి లాస్ట్ మినిట్​ లో చాలా సీరియస్ రెఫరల్​ ​ కేసులు వస్తుంటాయి. అందులో కొన్ని బ్రాట్​ డెడ్​ కూడ ఉంటున్నాయి. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదు. అనుభవజ్ఞులైన డాక్టర్లు, అన్ని వసతులతో ఆపరేషన్లు థియేటర్లు ఉన్నాయి. ప్రత్యేకంగా మాతా, శిశువుల వైద్యం కోసం ప్రత్యేకంగా ఎంసీహెచ్​ బిల్డింగ్ కూడ ఉంది. సరిపోయేన్ని బెడ్లు కూడ ఉన్నాయి. ఇక తల్లులకు, చిన్నారులకు ఇచ్చే ప్రభుత్వ కిట్లు ఇప్పటికి ఇస్తున్నాం. పేర్లు మాత్రమే మారాయి.  రిటైర్డ్ అయిన ఆఫీస్​ సూపరింటెండెంట్ రామయ్యకు ఆయనకు ఉన్న అనుభవం దృష్ట్యా లీగల్​ తదితర అంశాల నిర్వహణకు సంబందించిన ఔట్​ సోర్సింగ్​ లో తాత్కలిక ఉద్యోగ బాధ్యతలు ఇచ్చాం. ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్​ గా డిప్యూటీ సూపరింటెండెంట్​ డా.సునీల్​ చూస్తున్నారు. ఔట్​ సోర్సింగ్​ సిబ్బందికి 4నెలలుగా జీతాలు రావడం లేదన్నది వాస్తవమే. దీనిపై కాంట్రాక్టర్లను వివరణ కోరాం. వీరిపై ఒత్తిడి తెచ్చి త్వరలోనే జీతాలు ఇప్పిస్తాం. అసలు ఫెర్టిలిటీ సెంటర్​ ఇప్పటి వరకు ఓపెన్​ కాలేదు. త్వరలోనే అన్ని సౌకర్యాలు, నిపుణులైన డాక్టర్లతో ప్రారంభిస్తాం. గాంధీలో 15 ఏండ్ల నుంచి పనిచేస్తున్న  డీఈవో (డేటా ఎంట్రీ ఆపరేటర్​ ) లను తొలగించడం లేదు. వారిని ఏదేని విభాగంలో అడ్జస్ట్ చేస్తాం...  ""
––––––––––
–ఫొటోలు:

Tags