గల్ఫ్  కార్మికుల కల నెరవేర్చిన జీవో 205

On
గల్ఫ్  కార్మికుల కల నెరవేర్చిన జీవో 205

గల్ఫ్  కార్మికుల కల నెరవేర్చిన జీవో 205

వేములవాడ సెప్టెంబర్ 18:

దీర్ఘకాలికంగా కాలయాపనకు  గురైన గల్ఫ్ సంక్షేమం కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గల్ఫ్ అంశాన్ని పరిగణలోకి తీసుకొని, సంక్షేమ కార్యాచరణకు బీజం వేయడాన్ని స్వాగతిస్తున్నామని,
ముందు నుండి ప్రత్యేక చొరవ తీసుకున్న వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి, గల్ఫ్ దేశాల్లో ఉన్న 15 లక్షల కార్మికుల తరఫున    ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ యూఏఈ దుబాయ్ అధ్యక్షులు బత్తిని రాజు  కృతజ్ఞతలు తెలియజేశారు. గత 15 సంవత్సరాలుగా, గల్ఫ్ కార్మికుల పోరాటం,చేశారు పోరాట ఫలితంమే ఈ 
జీవో 205,గల్ఫ్ కష్టాలను ప్రభుత్వం ఈ రోజు గుర్తించింది అని రాజాగౌడ్ అన్నారు సెప్టెంబర్ 16వ తేది  గల్ఫ్ కార్మికులకు  పండగ రోజు. యెన్నో దశాబ్ద సంవత్సరాల ఉద్యమం ఫలించింది. చాలా సంతోషం వ్యక్తం చేశారు త్వరలో గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి, కార్మికులను ఆదుకోవాలి.  ఇక కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు చేయవలసిన సౌలతుల కోసం ప్రణాళిక రూపొందించాలి,కేంద్ర ప్రభుత్వం ద్వారా10 లక్షల రూపాయల విలువైన 'ప్రవాసీ భారతీయ బీమా యోజన' అనే ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని  చేర్పించలి,అని పెద్దన్న స్తానం రాష్ట ప్రభుత్వానిది అయితే,
తండ్రి స్థానం కేంద్ర ప్రభుత్వానిది, కాబట్టి కేంద్రం ఆలోచన చేయాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ యూఏఈ దుబాయ్ అధ్యక్షులు బత్తిని రాజా గౌడ్,అన్నారు.

Tags