ఎమ్మెల్యే అరికేపూడి గాంధీపై హత్యాయత్నం కేసు
ఎమ్మెల్యే అరికేపూడి గాంధీపై హత్యాయత్నం కేసు
హైదారాబాద్ సెప్టెంబర్ 14:
హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి,
శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల వివాదం కీలక మలుపు
తీసుకుంది. ఈ వివాదంలో అరికెపూడి
గాంధీపై పోలీసులు హత్యాయత్నం
కేసు నమోదు చేశారు. ఆయనో పాటు, ఆయన సోదరుడు, కుమారుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మరో ఇద్దరుకార్పొరేటర్లు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్లపై కేసులు పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల
మధ్య మూడు రోజులుగా వివాదం
చెలరేగుతున్న విషయం తెలిసిందే.
గురువారం నాడు అరికెపూడి గాంధీ
తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడీ. తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి
ఇంటి ముందు ఆందోళనకు దిగగా..
జనాల్లో కొంతమంది కౌశిక్ రెడ్డి ఇంటిపై
దాడి చేశారు. ఈ క్రమంలోనే
పోలీసులు అరికెపూడి గాంధీతో పాటు
30 మందికి పైగా ఆయన
అనుచరులను అరెస్ట్ చేసి గచ్చిబౌలి
పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే
ముందుగా ఆయనపై హత్యాయత్నం
కేసు నమోదు చేయకపోయినా
తాజాగా అటెంప్ట్ టూ మర్డర్ సెక్షన్ని
కూడా చార్జ్ షీట్లో నమోదు చేసినట్లు
సమాచారం