బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి గొల్లపల్లి పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు

On
బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి గొల్లపల్లి పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు

బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి గొల్లపల్లి పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు

గొల్లపల్లి సెప్టెంబర్ 13 (ప్రజా మంటలు) :

హరీష్ రావు తో పాటు బిఆర్ఎస్  పార్టీ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టుకు నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన
గొల్లపల్లి మండల బి ఆర్ఎస్ పార్టీ  మండల అధ్యక్షుడు బొల్లం రమేష్, మండల కోఆర్డినేటర్ బోయపోతు గంగాధర్, మాజీ ఏఎంసీ చైర్మన్ కాంపెళ్లి హన్మాండ్లు, బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మండల కన్వీనర్ కోమల్ల జలందర్, యూత్ మండల ఉపాధ్యక్షుడు సల్లూరి శోభన్ గౌడ్, బి ఆర్ఎస్ వి మండల ప్రధాన కార్యదర్శి పల్లెర్ల వినయ్, సీనియర్ నాయకులు జనుప వెంకటేష్, ముద్దం లక్ష్మణ్ గౌడ్, రత్నం, దావుల రాకేష్, వినోద్,  అరెస్టు చేసి గొల్లపల్లి పోలీసు స్టేషన్ కు  ఎస్సై సతీష్ తరలించారు.

  బిఆర్ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్ బోయపోతు గంగాధర్ మాట్లాడుతూ
""అర్థరాత్రి అక్రమ అరెస్ట్""లను మేము ఖండిస్తున్నాం.నిన్న హైదరాబాద్ లో బి ఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి  ఇంటిని ముట్టడించి దాడి చేయడాన్ని మేము ఖండిస్తున్నాం.. అక్కడ   జరిగిన సంఘటన చూస్తుంటే నియంత పాలన కండ్లకు కనిపిస్తుంది.
తెలంగాణ రాష్ట ప్రజల క్షేమం కోరి అనునిత్యం ప్రజలకోసం పరితపించే నాయకులు బి ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లు, ఎంపీ లు, హరీష్ రావు  అరెస్ట్ చేయడం, బి ఆర్ఎస్  పార్టీ నాయకులను అర్థరాత్రి హజ్ అరెస్ట్ చేసుడు మానుకొని, రైతు రుణమాఫి పూర్తి స్థాయిలో అమలు చేయండి, రాష్టంలో అకాల వర్షాలకు నష్ట పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ద్వారా ఆదుకోండి..
 నాయకులను అర్థరాత్రి అరెస్ట్ చేసినంత మాత్రాన ఆగిపోతుందా పోరాటం.
30 మందిని వేసుకొని బెదరించనికొస్తే   రాత్రి 4కోట్ల తెలంగాణ కదిలింది. ఇక్కడ ఉన్నది బి ఆర్ఎస్ పార్టీ సైనికులు అని మరిచిపోయారా
బి ఆర్ఎస్ పార్టీ కి కొత్త కాదు పోరాటం చేయడం ..

రేవంత్ రెడ్డి మళ్లీ ఉద్యమం చేసే అవకాశం మా యువతకు ఇచ్చారు..
మీడియా, సోషల్ మీడియా అంతగా లేనప్పుడే ఉద్యమాన్ని ఉరకలెత్తించినం.
ఇప్పుడు అన్ని ఉన్నాయ్.. చూస్కో మళ్ల ..
ఆగం ఐతున్న మా రాష్ట్రం కోసం తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న ప్రతీ యువత కదులుతారు అని హెచ్చరించారు...

Tags