వెన్నెముక వ్యాధులతో బాధపడుతున్న దివ్యాంగులకు ప్రత్యేక ఆరోగ్య క్యాంపు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 17 (ప్రజా మంటలు)
తెలంగాణ ప్రభుత్వం మహిళ, శిశు , దివ్యాంగుల మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ మరియు జిల్లా సంక్షేమ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జీవితకాల వెన్నే ముక వ్యాదులతో బాధపడుతున్న అత్యధిక మద్దతు అవసరం వున్నా 16 మంది దివ్యాంగులకు ప్రత్యేక ఆరోగ్య క్యాంపు నిర్వహించడం జరిగింది.
దీని ద్వారా వారికీ కావలసిన వైద్య సేవలు, మద్దతు దినసరి చర్యల మద్దతు మొదలగు అత్యధిక అవసరాల కొరకు ప్రభుత్వం తరపు సహాయం అందించడానికి బెంచ్ మార్క్ వికలాంగత్వం కలిగిన దివ్యంగులకు ఆర్థోపెదిక్ సర్జన్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు, దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ వారికీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నావారు జిల్లా సంక్షేమ అధికారి Dr B.నరేష్ , జిల్లా జిల్లా వైద్యాధికారి Dr ప్రమోద్ ,సూపర్డెంట్ Dr రాములు, ఫీల్డ్ ఆఫీసర్ కొండయ్య, సీనియర్ సహాయకులు చంద్రమోహన్, సదరం కోఆర్డినేటర్ కుమార్ మరియు దివ్యంగులు పాల్గొన్నారు .