రోళ్ళ వాగు ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
భీర్పూర్ సెప్టెంబర్ 1 3 ( ప్రజా మంటలు ) :
బీర్పుర్ మండలంలో 136.81 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రోళ్ళవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
శుక్రవారం రోజున బీర్ పూర్ మండలంలో రోళ్ళవాగు ప్రాజెక్టు నిర్మాణ పనులను జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్ తొ కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రాజెక్టు వివరాలను, నిర్మాణ పనులను మరియు ప్రాజెక్ట్ సామార్ధ్యత ను 0.250 టి ఎం సి నుండి 0.949 టి ఎం సి పెంచడం వలన మునుగు అటవీ భూములకు బదులుగా ఇచ్చే ప్రభుత్వ భూముల గురించి, అటవీ అనుమతుల ప్రక్రియ గురించి నీటి పారుదల శాఖ, అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కావలసిన పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్, నీటిపారుదల శాఖ డీఇఇ చక్రు నాయక్, ఫారెస్ట్ రేంజ్ అధికారి, ధర్మపురి మరియు తదితరులు పాల్గొన్నారు.