పెన్షనర్ల ఆశలన్నీ క్యాబినెట్ పైనే..! - టీ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

On
పెన్షనర్ల ఆశలన్నీ క్యాబినెట్ పైనే..! - టీ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

పెన్షనర్ల ఆశలన్నీ క్యాబినెట్ పైనే..!
-టీ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

 జగిత్యాల సెప్టెంబర్ 18 :

ఈనెల 20న జరిగే క్యాబినేట్ మీటింగ్ పైనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలో అసోసియేషన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
దసరా ముందు డీఏలు, పీఆర్సీ, పెండింగ్ సమస్యలపై తీపి కబురు చెప్తారని ఎదురుచూపులు చూస్తున్నామని, ఎంతోకాలంగా డీఏ (కరువు భత్యం), పీఆర్సీ (పే రివిజన్ కమిషన్), ఇతర సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. మొత్తం ఐదు డీఏలు, రెండో పీఆర్సీ నివేదిక తోపాటు ప్రత్యేక ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ,పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఆగస్టు 15 తర్వాత ఉద్యోగులకు డీఏలు ప్రకటిస్తారని అంతా భావించామని,ప్రభుత్వం కూడా రైతు రుణ మాఫీ పూర్తైన వెంటనే ఉద్యోగులు,ఉపాధ్యాయులకు ,పెన్షనర్లకు సంబంధించిన డీఏలను ప్రకటిస్తామని ప్రకటించింది. కానీ రైతు రుణ మాఫీ తర్వాత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన లేదు.  దసరా, దీపావళి పండుగల దృష్ట్యా పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని తమ టి.పి.సీ.ఏ. రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో ఈ నెల 13 న రాష్ట్ర ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శికి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లకు వినతిపత్రం  సమర్పించామన్నారు. దీంతో ఈనెల 20న జరిగే క్యాబినెట్ సమావేశంలోనా  పెండింగ్ డి.ఏ.ల విడుదల, పీ ఆర్.సీ. ఫిట్మెంట్ , నగదు రహిత  వైద్య సౌకర్యాల పై ,తదితర ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వం ను  కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో పెన్షనర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విష్వనాథం,సహాయ అధ్యక్షుడు పి.హన్మంత్ రెడ్డి,ఉపాధ్యక్షులు వెల్ముల ప్రకాష్ రావు,ఎం.డి.యాకూబ్,నాయకులు పబ్బా శివానందం, విఠల్,సత్యనారాయణ,దేవేందర్ రావు,నారాయణ,మధుసూదన్ రావ్,ప్రసాద్,మురళీదర్,కరుణ,విజయలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.

Tags