కాంగ్రెస్ పార్టీ నాయకులు నీతి మాలిన రాజకీయాలు మానుకోవాలి. .- మాజీ మంత్రి కొప్పుల*

On
కాంగ్రెస్ పార్టీ నాయకులు నీతి మాలిన రాజకీయాలు మానుకోవాలి. .- మాజీ మంత్రి కొప్పుల*

కాంగ్రెస్ పార్టీ నాయకులు నీతి మాలిన రాజకీయాలు మానుకోవాలి.
*మనుషులతో పాటు దేవుళ్ళ ను కూడా కాంగ్రెస్ పార్టీ వంచింది.  
 - మాజీ మంత్రి కొప్పుల*
కరీంనగర్ సెప్టెంబర్ 15:
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని అరికెపూడి గాంధీ నేను బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని బుకాయిస్తున్నడని, ఒక పదవి కోసం గాంధీ కి ఇంత దిగజారుడు రాజకీయమా అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.

రెండు మూడు రోజుల నుండి జరుగుతున్నటు వంటి రాజకీయ వ్యవహారాన్ని చూసినట్లయితే ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతూ స్వయంగా అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని వారి వ్యక్తిగత విబేధాలు మాకేం సంబంధం లేని మాట్లాడుతున్నారనీ,
కానీ అరికెపూడి గాంధీ స్వయంగా ముఖ్యమంత్రి  చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని, తానే మాట్లాడుతూ మా కార్యకర్తలను నాయకులను సంప్రదించాకనే కాంగ్రెస్ పార్టీ లో చేరిన అని అనడం తెలంగాణ ప్రాంత ప్రజలు అందరూ చూశారని కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు.

నిబంధనలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి,, మంత్రులకు ధైర్యం ఉంటే, అరికెపూడి గాంధీని కాంగ్రెస్ పార్టీలో చేరిండు అందుకే పి ఏ సి చైర్మెన్ పదవి ఇచ్చామని చెప్పాలని, ఆ ధైర్యం కాంగ్రెస్ నాయకులకు లేదనీ మాజీ మంత్రి ఎద్దేవా చేసారు.

ఈ సంఘటన పై మంత్రులు ముఖ్య నాయకులు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మధ్య వ్యక్తిగత విబేధాలతో మాకేం సంబంధం అని నిస్సిగ్గుగా మాట్లాడం ఆశ్చర్యం కలిగిస్తోందని, వీరు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు..!

స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరికెపూడి గాంధీ కి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పిన విషయం తెలంగాణ ప్రజలు చూడలేదా...! సోషల్ మీడియా లో 10 ఎమ్మెల్యే లకు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నరో వారిని ప్రజలు గమనించలేదని అనుకుంటున్నారు..!గాంధీ కి పదవి ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి..! 

నిజంగానే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటల్లో తప్పు ఏముంది..! అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని, పదవి తీసుకొని, ఇప్పటికీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని అని మాట్లాడుతున్నాడు..! 

పదవికోసం కండువా కప్పుకుని భాజాప్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన అని ప్రకటించిన అరికెపూడి గాంధీ, PAC పదవి తీసుకొని ఇప్పుడు నేను వేసుకున్నది దేవుడి కండువా అని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే అందరు నవ్విపోతున్నారని ఎద్దేవా చేశారు.

దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, మీ ముఖ్యమంత్రి కి మీకు అందరి అలవాటు అయింది.మనుషులతో పాటు దేవుళ్ళ ను కూడా కాంగ్రెస్ పార్టీ వంచిందను అన్నారు.

కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలలో తప్పు ఏముంది..? నువ్వు నిజంగానే బిఆర్ఎస్ పార్టీ శాసన సభ్యునివి అయితే నీ మెడలో గులాబీ కండువా వేసుకో..!లేదంటే మేము ఇంటికి వచ్చి వేస్తాము...లేదంటే తెలంగాణ భవన్ కు వచ్చి వేసుకో అని అడిగిండు..! అందులో తప్పు ఏముంది.. అది వ్యక్తిగత విషయమ అని ప్రశ్నించారు.

సిగ్గు లజ్జ లేకుండా అరికెపూడి గాంధీ హైదరాబాద్ లోని కౌశిక్ రెడ్డి ఇంటిపై నీ అనుచరులతో దాడి చేసి ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబాలను అందరిని భయబ్రాంతులకు గురి చూసి ఆస్తి నష్టం చేసి, కౌశిక్ రెడ్డి ని చంపే ప్రయత్నం చేస్తివి. ఇదెక్కడి సాంప్రదాయం ఎక్కడ నేర్చుకున్నావ్..! పైగా బుఖాయిస్తున్నవ్ అని అన్నారు 

ఈ సంఘటన జరిగిన సమయంలో పోలీసులు ఏం చేస్తున్నారు...! డిజిపి ఏంచేస్తుండు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతుండా.. డిసిపి, ఏసిపి, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నారు.. పైగా బిఆర్ఎస్ కార్యకర్తలను గేట్ దగ్గర ఆపుతారు.. కాంగ్రెస్ కార్యకర్తలను కొట్టండి అని  విచ్చలవిడిగా వదిలేస్తారా..! ఇదేనా న్యాయం అంటే..నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యేనే నాకు కౌశిక్ రెడ్డి కి వ్యక్తిగత విషయం అని సిగ్గు లేకుండా‌ గాంధీ మాట్లాడుతున్నాడు..! ఇది ఎలా వ్యక్తిగత విషయం అవుతుంది ఇది బిఆర్ఎస్ సంబంధించిన విషయం.. తెలంగాణ ప్రజలకు గాంధీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనీ అన్నారు.

ఇదంతా జరుగుతుంటే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్యన విబేధాలు అని మంత్రులు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు..! దీని వెనుక మీరు లేరా, మీ ప్రోత్సాహం లేదా..! ఇదంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లో జరగలేదా..అని ప్రశ్నించారు.
ఎన్నికల ముందు అబద్ధాలను చెప్పి ప్రజలను మోసం చేస్తిరి.. ఇప్పుడు మళ్లీ అబద్ధాలు ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నడు కూడా రాజకీయాల్లో చూడలేదు.. ఇది చాలా దుర్మార్గం దీనిపై ఎవరైతే మాట్లాడిండ్రో అని ఆగ్రహం వ్యక్తం చేశారు..

Tags