BRS ప్రజాప్రతినిధుల అక్రమ అరెస్ట్ ను ఖండించిన మాజీ మంత్రి కొప్పుల, జిల్లా అధ్యక్షులు,మాజీ జెడ్పీ ఛైర్పర్సన్
BRS ప్రజాప్రతినిధుల అక్రమ అరెస్ట్ ను ఖండించిన మాజీ మంత్రి కొప్పుల, జిల్లా అధ్యక్షులు,మాజీ జెడ్పీ ఛైర్పర్సన్
జగిత్యాల డిసెంబర్ 05 :
బి ఆర్ యస్ పార్టీ ప్రజాప్రతినిధుల అక్రమ అరెస్ట్ లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ లు పత్రిక విలేఖరుల సమావేశంలో ఖండించారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రం లో పోలీస్ రాజ్యాంగం నడుస్తుందనీ,కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా, మౌళిక సదుపాయల కల్పన... మంచి పరిపాలన అందించారని గుర్తు చేశారు..!
ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో స్నేహపూర్వక వాతావరణం వుండేదాని... కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పోలీస్ లను అడ్డం పెట్టుకొని..అక్రమ అరెస్ట్ లు... చేస్తుందన్నారు...!
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విషయంలో ఫిర్యాదు చేయడానికి వస్తే తన మీదే కేసు పెట్టి... రేవంత్ రెడ్డి కనుసన్నల్లో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయన్నారు...!
మాజీ మంత్రి హరీష్ రావు, అక్రమ కేసులు, కేటీఆర్ గార్ల పై రాజకీయ కక్ష తోనే కేసులు పెట్టాలని మండి పడ్డారు.
ప్రధాన ప్రతిపక్షం గా ఉండి 420 హామీలు నెరవేర్చాలని అడగటం తప్పా అని రేవంత్ రెడ్డి సర్కార్ ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.
గురుకుల పాఠశాల విద్యార్థుల భోజనం విషయంలో విద్యార్థులు ఆందోళన చేస్తే.. దీని వెనుక బిఆర్ఎస్ హస్తం ఉందనడం విడ్డూరంగా ఉందన్నారు.
విద్యార్థుల సమస్యపై గురుకుల లకు వెలితే అక్రమ అరెస్ట్ లు...! ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలకు జవాబుదారితనం ఉండాలన్నారు.
రైతురుణమాఫీ, రైతు భరోసా గురించి రైతులు, గురుకుల విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని,మంచి పరిపాలన అందించి.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అక్రమ అరెస్ట్ లను తీవ్రంగా ఖండించారు.
పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, భారతదేశంలో 1978 లో ఇందిర గాంధీ హయాంలో ఎమర్జెన్సీ ఉన్నట్టు ఇప్పుడు తెలంగాణాలో ఎమర్జెన్సీ తలపిస్తున్నదని,మాట్లాడితే అరెస్ట్ లు, జూట మాటలతొ ప్రజలను నమ్మిస్తూన్నాడనీ విమర్శించారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చాలని,
ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అండగా ఉంటామని,
రేవంతరెడ్డి కి ఊహించని పదవి వచ్చిందని.. పిచ్చి మాటలు బంద్ చేయాలనీ, ఇచ్చిన హామీలు అమలు చేసి మంచి పాలన అందించాలని హితవు పలికారు..
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కంప్లైంట్ ఇస్తే ఎ సి పి,సీఐ, ఫిర్యాదు తీసుకోకపోవడం... తిరిగి కౌశిక్ రెడ్డి పై కేసు పెట్టడం, మాజీమంత్రి హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి,నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే లపై అక్రమ కేసులు పెట్టడాన్ని జగిత్యాల జిల్లా బి ఆర్ యస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
మేము హామీలు నెరవేర్చాలని అడగటం తప్పా,
ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దా...
ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు...
గురుకుల పాఠశాల విద్యార్థుల భోజనం విషయంలో విద్యార్థులు ఆందోళన చేపడితే.. దీని వెనుక బి ఆర్ యస్ హస్తం ఉందనడం..మద్దతుగా గురుకులాలకు వెళితే అరెస్ట్ లు చేయడం అన్యాయమని అన్నారు.
ఈ కార్యక్రమం లో లోక బాపు రెడ్డి,హరిచరణ్ రావు, గోస్కుల జలంధర్, మాధవ రావు, వొళ్లెం మల్లేశం, గంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
ఈ కార్యక్రమం లో లోక బాపు రెడ్డి, హరిచరణ్ రావు, గోస్కుల జలంధర్, మాధవ రావు, వొళ్లెం మల్లేశం, గంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు..