అంబేద్కర్ భవన్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
లోయర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్ లో
అంబేద్కర్ భవన్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
లోయర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్ లో
సికింద్రాబాద్ నవంబర్ 27 (ప్రజామంటలు):
ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ లోయర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్ లో 75వ రాజ్యాంగ ఆమోదిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్సీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్ హాజరై రాజ్యాంగ నిర్మాణానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషిని వివరించారు. ప్రస్తుత సమాజంలో బహుజన సంఘాల పాత్ర, పౌరుల బాధ్యతలను వివరించారు. సమాజంలో అనేక అంశాలపై ప్రవచనాలు చేస్తారు గాని అత్యంత శక్తివంతమైన, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రాజ్యాంగం కోసం మాత్రం ఎవరు చెప్పకపోవడం బాధాకరమని ఆవేదన వెలిబుచ్చారు. రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసినందువలనే అణగారిన వర్గాల ఆకాంక్షలు నెరవేరాయని చోల్లేటి ప్రభాకర్ అన్నారు. దళితులకు రాజ్యాధికారం ఎండమావేనా....? అనే కరపత్రాన్ని ముఖ్యఅతిథి చొల్లేటి ప్రభాకర్ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో ఏఐఎస్సీఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు రాగల నాగేశ్వరరావు, జాతీయ ముఖ్య కార్యదర్శి ఎస్. నరసింహారావు, ప్రొఫెసర్ ఏకు తిరుపతి, తెలంగాణ అధ్యక్షులు దొమ్మాటి సుదర్శన్ బాబు, సౌత్ సెంట్రల్ రైల్వే యూనియన్ నాయకులు టాక్సీ బాబు, ఎస్సీఆర్పీఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి స్టాలిన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు గుంటి విజయబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాడపాక పరంజ్యోతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిమ్మగల్ల జంగయ్య, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి పాకాల అశోక్ కుమార్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ మరియు హెడ్ కానిస్టేబుల్స్ రాష్ట్ర అధ్యక్షులు సి.ఎచ్.ఆనంద్ రావు, నగర ఉపాధ్యక్షులు కుర్మ మహేందర్, విజయరామ్. బట్టు కృష్ణ,రాపాక అశోక్,నిమ్మ నాగలక్ష్మి,ఎల్లం కుమార్, కత్తి ప్రవీణ, గోకెర కవిత, సంగం మహేశ్, ఉదయ్ పాల్గొని ప్రసంగించారు.
––––––––––
–ఫొటో: