మహాత్మ జ్యోతిరావు పూలే హాస్టల్ సందర్శించిన అదనపు కలెక్టర్ రెవెన్యూ రాంబాబు
మహాత్మ జ్యోతిరావు పూలే హాస్టల్ సందర్శించిన అదనపు కలెక్టర్ రెవెన్యూ రాంబాబు
గొల్లపల్లి ఆగస్టు 30 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో మహాత్మ జ్యోతి రావు పూలే హాస్టల్లో సందర్శించిన
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాంబాబు సందర్శించి, వంటగదిని పరిశీలించి మరియు విద్యార్థుల అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండటానికి శుభ్రత పాటించి ఆరోగ్యకరమైన వంటకాన్ని నిర్వహించాలని సూచించి విద్యార్థులతో కలిసి భోజనం చేసి అలాగే మండల కేంద్రంలో రానున్న స్థానిక ఎన్నికల సందర్బంగా ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ఇంటింటి సర్వే పనులను సందర్శించి, వార్డు ఓటర్ల సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట మార్గదర్శకాలు సూచనలను జారీ చేసినారు.
కార్యక్రమములో తహశీల్దార్ జమీర్ , ప్రిన్సిపల్ సుస్మిత గీర్దావర్ అనూష, జీవన్, రెవెన్యూ సిబ్బంది అంగన్వాడి టీచర్స్ హరిప్రియ, అనంతలక్ష్మి , ఉమారాణి , తదితరులు పాల్గొన్నారు.