ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు) :
జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానంద జయంతి వేడుకలు స్వామి వివేకానంద మిని స్టేడియంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ....
- యువత స్వామి వివేకానంద గారి అడుగుజాడల్లో నడుస్తూ తమ లక్ష్యాన్ని నిర్ధారించుకొని అది సాధించేవరకు ఆగకుండా శ్రమించాలని అన్నారు.
- తరువాత ఈనెల 7న హైదరాబాద్ లో జరిగిన రాష్ట్రస్థాయి యువజన ఉత్సవాల్లో పాల్గొన్న యువ కళాకారులకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి డాక్టర్ కోరుకంటి రవికుమార్, జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి ఎస్ లత, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అల్వాల జ్యోతి, వార్డ్ కౌన్సిలర్ చుక్క నవీన్, పేట అధ్యక్షులు పడాల విశ్వ ప్రసాద్, పేట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల కృష్ణ ప్రసాద్, యువజన సంఘాల నాయకులు మర్రిపల్లి శ్రీనివాస్, చోలేశ్వర్, యువజన సంఘాల నాయకులు కళాకారులు యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు.