అమెరికా అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి జయశంకర్
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి జయశంకర్
న్యూఢిల్లీ జనవరి 12:
అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తారని ప్రభుత్వం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
దీనితో ఇన్నాళ్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం వస్తుందన్ ఆశించిన వారికి నిరాశే ఎదురయింది.గత ఎన్నికల్లో ట్రంప్ విజయానికి ప్రచారం చేసిన మోడీకి ఈసారి గెలిచినా, ప్రమాణస్వీకారానికి ఆహ్వానించకపోవడంపైబనేక రకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ట్రంప్-వాన్స్ ప్రారంభోత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఈ పర్యటన ప్రకటన వెలువడిందని అది తెలిపింది.
“ఈ పర్యటన సందర్భంగా, EAM రాబోయే పరిపాలన ప్రతినిధులతో పాటు, ఆ సందర్భంగా USను సందర్శించే మరికొందరు ప్రముఖులతో కూడా సమావేశమవుతారు” అని MEA తన పర్యటన ప్రకటనలో తెలిపింది.