గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించాలి
బిజెపి జిల్లా నాయకులు మాచర్ల కుమార్ గౌడ్
భీమదేవరపల్లి, ప్రజామంటలు జనవరి 12
24 వ జిల్లా స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ సెలక్షన్స్ మరియు టోర్నమెంట్ భీమదేవరపల్లి జోన్ కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ మాచర్ల కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ హాజరైనారు. ఈ సందర్భంగా మాచర్ల కుమారస్వామి గౌడ్ మాట్లాడుతూ, ఇక్కడ సెలెక్ట్ అయినవారికి హనుమకొండ క్యాంప్ లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. క్రీడాకారులు అందరు కూడా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాస్థాయిలో, రాష్ట్రస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ రెడ్డి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి, అబ్దుల్ ఖాన్, ఏఎస్ఐ సంపత్, మండల కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ సునీల్, మాజీ కబడ్డీ క్రీడాకారులు శివసారపు రవీందర్, పోలు రవీందర్, నాగరాజు, శ్రీనివాస్, గాజుల వెంకన్న, మాచర్ల కరుణాకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.