సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లోనే? - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లోనే?
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
మైనారిటీ డిక్లరేషన్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
నిజామాబాద్ జనవరి 12:
సీఎం రేవంత్ రెడ్డి మూలాల్అంu ar es es lo ఉన్నందునే, మైనారిటీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నట్లున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ,గాంధీల కుటుంబాన్ని చూసి మైనారిటీలు కాంగ్రెస్ కు ఓట్లు వేశారు.కానీ ఇప్పుడు మైనారిటీల నమ్మకాన్ని కాంగ్రెస్ వమ్ము చేస్తున్నదని,కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని,కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక మతకల్లోలాలు జరిగాయని,మతకల్లోలాలను నిరోధించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనీ విమర్శించారు.
కవిత మాట్లాడుతూ ఇంకా ఇలా అన్నారు.
కాంగ్రెస్ వాళ్లు గంగాజమునా తెహజీబ్ లా ఉన్న తెలంగాణలో చిచ్చుపెడుతున్నారు.మైనారిటీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందిమైనారిటీ డిక్లరేషన్ అమలు ఏమైంది ?మైనారిటీ డిక్లరేషన్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం
మైనారిటీలకు కేటాయించిన బడ్జెట్ లో కనీసం 25 శాతం కూడా ఖర్చు చేయలేదు.3000 వేల కోట్లు కేటాయించి కేవలం 700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.షాదీ ముబారక్ కింద రూ. 1.6 లక్షలతో పాటు తులం బంగారం ఇస్తామని ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి
నిజామాబాద్ లో తబ్లిఖీ జమాత్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేయాలి.బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాము