ఘనంగా శివకోటి అభిషేక వేడుకలు
జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు)
శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా శివ ముక్కోటి అభిషేక వేడుకలు ఘనంగా జరిగాయి. పుష్యమాసం భోగి ఆరుద్ర నక్షత్రం సోమవారం తో కూడిన పౌర్ణమి రావడం వల్ల ఈరోజును శివ ముక్కోటిగా పిలుస్తారు. శ్రీ అభయాంజనేయ స్వామి ఉత్సవ మూర్తికి, ఫల, పంచామృత అభిషేకం జరిపారు.
ఒకవైపు మాతలు, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తుంటే, మరోవైపు అర్చకులు అభిషేకం జరిపారు. తీర్థ ప్రసాద అనంతరం అన్న ప్రసాదం అందించారు.
ఈనాటి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బట్టు సుధాకర్, కొత్త మోహన్, గుడి కందుల శ్రీనివాస్, సామాజిక కార్యకర్త తవుటు రాంచంద్రం,అనంతుల ప్రేమ్ కుమార్, కొత్తపెళ్లి శ్రీనివాస్, కొత్తపెళ్లి నాగభూషణం, వీరభత్తిని శ్రీనివాస్, ముసిపట్ల లక్ష్మీనారాయణ, కే ఎల్ వి కృష్ణ, నూనె రాధాకృష్ణ, మానుక సంతోష్, ఎర్ర రంజిత్ కుమార్, ఉటూరి ఉమాపతి,బట్టు అరుణ్ కుమార్, మాతలు, భక్తులు, పాల్గొన్నారు.