సమగ్ర శిక్ష ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అర్హులు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబరు 17(ప్రజా మంటలు) :
రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఆర్డర్ ఆఫ్ మెరిట్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపికైన సమగ్ర శిక్ష ఉద్యోగులు నూటికి నూరు శాతం క్రమబద్ధీకరణకు అర్హులేనని పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెలో ఎనిమిదవ రోజు మంగళవారం పాల్గొని మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ....
- సమగ్ర శిక్ష ఉద్యోగులు కోరుతున్నవి గొంతెమ్మ కోరికలు కావని అన్నారు.
- వీరిని క్రమబద్ధీకరించడం వలన ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదన్నారు.
- అందుకే అన్ని ఉపాధ్యాయ సంఘాలు వీరి సమ్మెకు మద్దతు పలుకుతున్నాయని పేర్కొన్నారు.
- ఇప్పటికే తాను ముగ్గురు మంత్రులు ఇద్దరు ఎమ్మెల్యేలతో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్య పరిష్కరించేలా కృషి చేయాలని మాట్లాడినట్టు తెలిపారు.
- వీరి డిమాండ్లలో న్యాయం ఉంది కాబట్టే చట్ట సభల్లో చర్చకు వస్తుందని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి రొట్టె శ్రీనివాస్ మాట్లాడుతూ..... సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు బ్రహ్మాండ బేరి నరేష్, మసిపట్ల రాజేందర్, రిటైర్డ్ హెచ్ఎంలు ప్రభాకర్ రావు, వెంకటరమణ, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.
బతుకమ్మ ఆడి నిరసన : సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరింది.
రోజుకో రీతిలో నిరసన తెలుపుతున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులు మంగళవారం బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు.
ప్రభుత్వం వెంటనే తమను రెగ్యులరైజ్ చేయాలని అంతవరకు బేసిక్ పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.