కేసీఆర్ క్షమాపణ చెపితే నేను రాజీనామా చేస్తా - జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
కేసీఆర్ క్షమాపణ చెపితే నేను రాజీనామా చేస్తా - జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
కరీంనగర్ జనవరి 14:
గతంలో జరిగిన పరిణామాలపై కెసిఅర్ క్షమాపణ చెబితే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు
కరీంనగర్ లో పోలీస్ స్టేషన్ వద్దకు కాంగ్రెస్ నాయకులతో కలిసి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేరుకొన్నారు.
దూషించి నెట్టేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ డిమాండ్ చేశారు. గతంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ క్షమాపణ చెబితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే సంజయ్ కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఎమ్మెల్యే సంజయ్ తో అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డికి బెదిరించడం అలవాటని ఎమ్మెల్యే కాకముందే అతనిపై అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రజా సమస్యలపై సమావేశంలో మాట్లాడాలనుకుంటే కౌశిక్ రెడ్డి ఆటంకం కలిగించాడని, తన స్వేచ్ఛను హరించే హక్కు అతనికి ఎక్కడిదని ప్రశ్నించారు. అభివృద్ధి సంక్షేమాన్ని కాంక్షించే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు.
గతంలో బిఅర్ఎస్ లో చేరిన వారిచే కేసిఆర్ రాజీనామా చేయించారా అని ప్రశ్నించారు.
గతంలో జరిగిన పరిణామాలపై కెసిఅర్ క్షమాపణ చెబితే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
నన్ను అనే ముందు కౌశిక్ రెడ్టి ఎన్ని పార్టీలు మారారో తెలుసుకోవాలన్నారు.