జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ సభ్యులుగా కమటాల శ్రీనివాస్
జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు)
జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యులుగా కమటాల శ్రీనివాస్ నియామకంలో సహకరించి సంపూర్ణ ఆశీర్వాదాన్ని అందించిన రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కరీంనగర్ నందలి ఆయన స్వగృహంలో కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసి తన నియామకానికి సహకరించినందుకు కమటాల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్సీ చేతుల మీదుగా నియామక పత్రాన్ని పొందారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కమటాల శ్రీనివాస్ కు అభినందనలు తెలియజేశారు.
అనంతరం ఆర్టిఓ కార్యాలయంలో రవాణా అధికారిని కలిసి బాధ్యతలు స్వీకరించారు. కాగా జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వూటూరి నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి బొడ్ల రాజు వాసవి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు పల్లెర్ల రాజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ తో పాటు పలువురు వైశ్య ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.