జగిత్యాల ఎమ్మెల్యే వర్గీయులచే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.
జగిత్యాల ఎమ్మెల్యే వర్గీయులచే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు):
జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వర్గీయులు, అభిమానులు, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలు లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సభ్యుల సమీక్ష సమావేశం లో హుజురాబాద్ శాసనసభ్యులు,బి అర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పైన అనుచిత ప్రవర్తనకు నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి 7 గంటలకు, తహసిల్ చౌరస్తా వద్ద పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ ను డా.ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభిమానులు, శ్రేయోభిలాషులు నాయకులు దహానం చేసి,ధర్నా చేపట్టారు,
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం నాయకత్వం వహించగా,మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ కౌన్సిలర్లు పిట్ట ధర్మరాజు, కూతురు రాజేష్, పంబాల రాంకుమార్,నాయకులు బద్దం జగన్మోహన్ రెడ్డి బాల ముకుందము నక్కల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.