తెలంగాణ అక్షర సూరీడు అలిశెట్టికి నివాళి
తెలంగాణ అక్షర సూరీడు అలిశెట్టికి నివాళి
- సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.
జగిత్యాల జనవరి 12:
తెలంగాణ అక్షర సూరీడు అలిశెట్టి అని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నారు.ఆదివారం తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ ,పెన్షనర్స్ అసోసియేషన్స్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో అలిశెట్టి జయంతి,వర్ధంతి కార్య క్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా అంగడిబజార్ లో ఉన్న అలిశెట్టి విగ్రహానికి హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అసోసియేషన్ కార్యాలయంలో కవి సమ్మేళనము నిర్వహించారు.ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ నా బాల్య మిత్రుడుగా అలిశెట్టి అయినందుకు గర్వంగా ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత అలిశెట్టి కవితలు ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాల్లో ప్రవేశ పెట్టడం తెలంగాణ కవుల గుర్తింపుకునిదర్శనమన్నారు.అలిశెట్టి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమ అసోసియేషన్ తరపున కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, కోశాధికారి వేల్ముల ప్రకాష్ రావు, పెన్షనర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,సహాయ అధ్యక్షుడు పి.సి.హన్మంత రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు పూసాల ఆశోక్ రావు,కే.సత్యనారాయణ,సంయుక్త కార్యదర్శులు దిండిగాల విఠల్, సింగం గంగాధర్,భాస్కర్,రాజ్ గోపాల్ చారి, బి.రాజేశ్వర్,బీ.కరుణ,పెన్షనర్స్,సీనియర్ సిటీజేన్స్,టీ బీసీ. జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.