బుగ్గారం లో నెహ్రూ యువకేంద్రం బ్లాక్ లెవల్ స్పోర్ట్స్
బుగ్గారం లో నెహ్రూ యువకేంద్రం బ్లాక్ లెవల్ స్పోర్ట్స్
బుగ్గారం డిసెంబర్ 16 :
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ నిర్వహించారు.
స్థానిక జడ్పీ హైస్కూల్ మైదానంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి సురోజు వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనోహర్ రెడ్డి , చైల్డ్ మ్యారేజ్ ప్రాజెక్ట్ డిస్టిక్ కోఆర్డినేటర్ భూమేష్, యువజన నాయకులు సుంకం ప్రశాంత్ తదితరులు పాల్గొని క్రీడలను ప్రారంభించారు. అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. పోటీల్లో వాలీబాల్ ఆటలో ప్రధమ బహుమతి బుగ్గారం, ద్వితీయ బహుమతి చిల్వకోడూర్ జట్టులు గెలుచుకున్నాయి.
కబడ్డీ ప్రథమ బహుమతి గుంజపడుగు, ద్వితీయ బహుమతి లోత్తునూర్ గెలుచుకుంది. పరుగు పంందెంలో వినయ్, అభినయ్, సాయి వర్ధన్, విజేతలుగా నిలిచారు. గెలుపొందిన బుగ్గరం, గుంజడుగు జట్టులకు స్పోర్ట్స్ కిట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ మారం గణేష్, పిఈటి రవితేజ, హరీష్ తదితరులు పాల్గొన్నారు.