ఘనంగా దత్తాభిషేకం, గాయత్రీ యజ్ఞం, సత్యనారాయణ వ్రతం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు) :
మార్గశిర మాసం దత్త జయంతిని పురస్కరించుకొని దత్తాభిషేకం, గాయత్రి యజ్ఞం మరియు సామూహిక సత్యనారాయణ వ్రతం యజ్ఞ నిర్వాహకులుగా కాసం అశోక్ గుప్త నిర్వహించగా సత్యనారాయణ వ్రతాన్ని పూసాల బ్రహ్మయ్య నిర్వహించారు.
ఇట్టి కార్యక్రమంలో కర్నే లతా రాజేశం, అరుణ నాగేశ్వరరావుదంపతులు, కొమురవెల్లి సునీత ప్రభాకర్ దంపతులు, చలిగల్ శంకర్ దంపతులు,,హోంగార్డు శ్రీనివాస్ దంపతులు, పరివార్ సీనియర్ కార్యకర్త కనపర్తి నాగభూషణం దంపతులు 80వ పుట్టినరోజును 80 దీపాలతో జన్మదిన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
పరివార్ కార్యకర్తలు చిలుముల రమేష్ దంపతులు, భార్గవి సంపూర్ణ చారి, పోచమ్మల సంపత్, మచ్చ గంగారం, మండలూజు భాస్కర్, నిత్యానందం, తిరుపతి, సిద్దు, చారి 50 మంది కార్యకర్తలతో తదుపరి అన్న ప్రసాద కార్యక్రమాలతో కార్యక్రమం విజయవంతం జరిగినదని కార్యక్రమం నిర్వాహకులు కొమురవెల్లి లక్ష్మీనారాయణ తెలియజేశారు.