నిఘా నీడలో గణేష్ నిమజ్జనోత్సవం.

జిల్లా లో ప్రశాంతంగా జరుగుతున్న గణేష్ నిమజ్జనం - నిమజ్జన సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

On
నిఘా నీడలో గణేష్ నిమజ్జనోత్సవం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9973349493/9348422113).

 

జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు) : 

జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జరిగే గణపతి ఉత్సవాలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.

పోలిస్ వివిధ శాఖల అధికారులంతా సమన్వయంతో పని చేస్తున్నారన్నారు.

వినాయక నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది అని నిమజ్జన ప్రాంతాల్లో భారీ క్రేన్ లను ఏర్పాటు చేశామన్నారు. వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సజావుగా సాగేందుకు జిల్లా పరిధిలో 24 X 7 పని చేస్తూ భద్రత పరంగా పూర్తి స్థాయిలో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.

విజిబుల్ పోలిసింగ్ తో పాటు సీసీటీవీల పై దృష్టి సారించామని,ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులంతా సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. 

ఎస్పీ వెంట డీఎస్పీలు ఉమామహేశ్వర రావు, రఘు చందర్ ,రవీంద్ర కుమార్, రంగా రెడ్డి, ఇన్స్పెక్టర్ లు , ఇతర శాఖల అధికారులు తదితర పాల్గొన్నారు.

Tags