వైభవోపేతంగా మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

On
వైభవోపేతంగా మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

వైభవోపేతంగా మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంIMG_20240919_083038

హైదరాబాద్ సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు) :

 మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి సర్వ సభ్య సమావేశము గోల్నాక సాయిబాబా మందిరము వేదికగా జరిగింది.

సర్వ సభ్య సమావేశము లో నూతన కార్యవర్గమును ఎన్నికల అధికారుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం తదుపరి ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం కార్యక్రమం  జరిగింది. 

అధ్యక్షులు గా బ్రహ్మ శ్రీ మహాదేవభట్ల లక్ష్మణప్రసాద్ శర్మ , ప్రధాన కార్యదర్శి గా బ్రహ్మ శ్రీ యలమంచి రామకృష్ణ శర్మ , కోశాధికారి గా బ్రహ్మ శ్రీ మధునూరి మహాదేవ శర్మ , బ్రహ్మ శ్రీ సిరిసిల్ల రామశర్మ గారు కన్వీనర్ గా మరియు యలమంచి చంద్రశేఖర శర్మ  కార్యనిర్వాహక కార్యదర్శి గా ఎన్నుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు బ్రహ్మ శ్రీ మహాదేవభట్ల లక్షణప్రసాద్ శర్మ  మాట్లాడుతూ ఈ  మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి మొట్టమొదలు శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్ర సేవా పరిషత్ గా ఉండేది అని ఆ తరువాత బ్రాహ్మణ సమాజానికి అన్ని రకాలుగా సహాయాన్ని అందించాలనే సదుద్దేశ్యంతో మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి గా నామకరణం చేసి గత18సంవత్సరాలుగా బ్రాహ్మణ సమాజానికి అనేక కోణాలో అర్హులైన బ్రాహ్మణ కుటుంబాలకు తమ వంతు సేవలందిస్తూ ముందుకు వెళ్తున్నామని, అదే విధంగా ప్రతీ సంవత్సరం  భగత్ క్షేత్రలో వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు ద్వాదశ జ్యోతిర్లింగాలు మరియు నేపాల్ లోని పశుపతి నాథ్ అలాగే అష్టాదశ శక్తి పీఠాలో ఆరు క్షేత్రాలలో దాదాపు మూడువందల మంది బ్రాహ్మణులచే శత రుద్ర సహిత శత చండీ యాగాలు విజయవంతంగా నిర్వహించిన ఘనత మా సంస్థ కు దక్కిందని పేర్కొన్నారు. వచ్చే విశ్వావసు నామ సంవత్సరం లో వార్షికోత్సవం జరిగే క్షేత్ర వివరాలను త్వరలోనే నిర్ణయించి ప్రకటిస్తామని తెలిపారు. మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన  కార్యవర్గ సభ్యుల వివరాలు 

*అద్యక్షులు*
బ్రహ్మ శ్రీ. మహాదేవభట్ల లక్షణప్రసాద్ శర్మ

*ప్రధాన  కార్యదర్శి*
 బ్రహ్మ శ్రీ. యులమంచి రామకృష్ణ  శర్మ 

*కోశాధికారి*
 బ్రహ్మ శ్రీ. మదునూరి మహదేవ శర్మ  

 *కన్వీనర్*
బ్రహ్మ శ్రీ. సిరిసిల్ల రాంప్రసాద్  శర్మ  కార్యనిర్వాహక కార్యదర్శి*
బ్రహ్మ శ్రీ యలమంచి చంద్రశేఖర శర్మ 
*ఉపాధ్యక్షులు*
1. బ్రహ్మ శ్రీ దామెరత సత్యనారాయణ శర్మ
2. బ్రహ్మ శ్రీ ఘణపురం రాంప్రసాద్ శర్మ 
3. బ్రహ్మ శ్రీ వడ్గిచర్ల విష్ణు మూర్తి శర్మ 
4. శ్రీమతి చలివేంద్రి భవాని
 

*సంయుక్త కార్యదర్శులు*

1. బ్రహ్మ శ్రీ జోషి సత్యనారాయణ 
2. శ్రీమతి కశోజ్జుల త్రివేణి
3. బ్రహ్మ శ్రీ రాజనాల వేంకటేశ్వర శర్మ
4. శ్రీమతి నెమ్మాని స్వప్న
 
*వైదిక కార్యదర్శులు*
1. బ్రహ్మ శ్రీ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ 
2. బ్రహ్మ శ్రీ కూచి వంశీ కృష్ణ శర్మ

*కార్యనిర్వాహక సభ్యుల బృందము*

1. బ్రహ్మ శ్రీ గోళ్ళ గోవర్ధన శర్మ (సహ కోశాధికారి  గా ప్రత్యేక భాధ్యత)
2. బ్రహ్మ శ్రీ దోమడాల విశ్వనాధ రావు 
3. బ్రహ్మ శ్రీ భాస్కరాయని విజయ్ కుమార్ శర్మ
4. బ్రహ్మ శ్రీ రామొజ్ఞుల విజయకుమార్ శర్మ
5. బ్రహ్మ శ్రీ విఠాల మురళీ ధర శర్మ
6. బ్రహ్మ శ్రీ జోషీ రమేశ్ 
7. బ్రహ్మ శ్రీ నిమ్మరాజు చంద్రశేఖర శర్మ ,గౌరవ సలహా దారులు*
1. బ్రహ్మ శ్రీ శ్రీ దోర్బల కృష్ణమూర్తి శర్మ 
2. బ్రహ్మ శ్రీ నెమ్మాని విష్ణుమూర్తి శర్మ 
3. బ్రహ్మ శ్రీ యలమంచి విఠలేశ్వర శర్మ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Tags