రామన్నపేట ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆస్పత్రిగా నిర్మాణం చేయాలి                    - నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

On
రామన్నపేట ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆస్పత్రిగా నిర్మాణం చేయాలి                    - నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

రామన్నపేట ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆస్పత్రిగా నిర్మాణం చేయాలి                    - నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

రామన్నపేట  సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు) : రామన్నపేట ఏరియా ఆసుపత్రిని 100 పడకల నిర్మాణం చేయాలని కోరుతూ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో రామన్నపేట కాంగ్రెస్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా రామన్నపేట ఏరియా ఆసుపత్రి 100 పడకలకు పెంచాలని వైద్యులను నియమించాలని కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి, వెంటనే వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ తో చరవానిలో మాట్లాడి అందుకు అవసరమైన నివేదిక అందజేయాలని ఆదేశించారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నిక ఓట్ల కోసం ఆర్భాటంగా ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే శంకుస్థాపనలు తప్ప ఎలాంటి నిధులు మంజూరు కాలేదని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తుందని అన్నారు. గత ప్రభుత్వం ఎలక్షన్స్ ఓట్ల కోసమే రాష్ట్రవ్యాప్తంగా శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలకే పరిమితమయ్యాయని విమర్శించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు గంగుల. వెంకట్ రాజారెడ్డి, గోదాసు పృథ్విరాజ్, మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ రెహన్,ఎండి, అక్రమ్ ,నోముల ప్రవీణ్ కుమార్ ,తదితరులు పాల్గొన్నారు.

Tags