రెండు ద్విచక్ర వాహనాలు, ప్రైవేట్ బస్సు డి ఇద్దరు మృతి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల రూరల్ సెప్టెంబర్ 15(ప్రజా మంటలు) :
హైదరాబాదు బలక్ పేట నుండి తీర్థయాత్రలకి బస్సులో వెళ్ళున్న యాత్రికులు.
వేములవాడ, కొండగట్టు దర్శనాలు చేసుకొని ధర్మపురి వెళ్తుండగా ప్రమాదం జగిత్యాల-ధర్మపురి జాతీయ రహదారి పై జగిత్యాల రూరల్ మండలం పోలస స్టేజి వద్ధ వరుసగా రెండు ద్విచక్రవాహనల ను ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు.
ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి.
మృతుల్లో ఒకరు వృద్ధుడు లచయ్య, మనమరాలు 9సం.,అమ్ములు, మరో 8సం.,మల్లికార్జున్ బాలుడికి తీవ్ర గాయలు
మరో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు.జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు.
ద్విచక్ర వాహనంపై పై నుండి బస్సు వెళ్ళడం తో నుజ్జు నుజ్జు అయిన మృతదేహాలు.గాయపడిన వారు పొలాస గ్రామానికి చెందినవారు.
ఘటన స్థలానికి చేరుకున్న డి ఎస్ పి పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.