ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు.. జగిత్యాల కలెక్టర్ బి. సత్య ప్రసాద్ 

On
ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు.. జగిత్యాల కలెక్టర్ బి. సత్య ప్రసాద్ 

ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు..
జగిత్యాల కలెక్టర్ బి. సత్య ప్రసాద్ 
 
(రామ కిష్టయ్య సంగన భట్ల)
 
జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు) : 
 
 ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.
 
సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ...  సెప్టెంబర్ 17 ను రాష్ట్ర  ప్రభుత్వం అధికారికంగా ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించుటకు ఆదేశాలు జారీ చేసిందని, కనుక అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పతాకావిష్కరణ చేయాలని తెలిపారు. ప్రజా పాలన దినోత్సవ వేడుకలను కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటగా జాతీయ గీతాలాపన తర్వాత, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గౌరవ ముఖ్య అతిథిచే ప్రసంగం ఉంటుందని తెలిపారు. మైక్ ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు కలిగి ప్రసంగానికి అవాంతరం కలుగకూడదని కలెక్టర్ ఆదేశించారు. ఉదయం 10 గంటలోగా ఉద్యోగులు అందరూ కార్యాలయానికి హాజరు కావాలని పేర్కొన్నారు. అలాగే ప్రోటోకాల్, షామియా మొదలగు వాటికి సంబంధించినవి చూసుకోవాలని ఆర్డీఓలకు కలెక్టర్ సూచించారు. అంబులెన్స్, ప్రథమ చికిత్స కు సంబంధించిన మందులు కానీ, ఓ. ఆర్. స్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, తహశీల్దార్లు అందరూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. గ్రామ పంచాయతిలో పంచాయతీ సెక్రటరీలు జెండా ఎగురేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు రాకూడదని, వస్తే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. అంతకు ముందు కలెక్టరేట్ పరిసరాలను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, గౌతం రెడ్డి, జగిత్యాల, మెట్ పల్లి ఆర్డీఓ లు మధు సుధన్, శ్రీనివాస్, డిఎస్పీ రఘు చందర్, కలెక్టరేట్ ఏ. ఓ. హన్మంత రావు, జిల్లా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Tags