అవకాశాలు వెత్తుకుంటూ మనం వెళ్ళడం కాదు  కష్టపడితే అవకాశాలె మన వెంట వస్తాయి -  విప్ లక్ష్మణ్ కుమార్

On
అవకాశాలు వెత్తుకుంటూ మనం వెళ్ళడం కాదు  కష్టపడితే అవకాశాలె మన వెంట వస్తాయి -  విప్ లక్ష్మణ్ కుమార్

అవకాశాలు వెత్తుకుంటూ మనం వెళ్ళడం కాదు  కష్టపడితే అవకాశాలె మన వెంట వస్తాయి..-      విప్ లక్ష్మణ్ కుమార్
ధర్మపురి ఆగస్ట్ 27 (ప్రజా మంటలు) : ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరు ఎంత పని చేశారో నాకు అన్ని తెలుసు. కష్ట కాలంలో నా వెంట ఉన్న ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యుడే. కష్టపడిన ప్రతి కార్యకర్తను భవిష్యత్తులో సముచిత స్థానాల్లో ఉంచుతామనీ ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

 

ధర్మపురి నియోజక వర్గ స్థాయి యూత్ కాంగ్రెస్ మెంబర్ షిప్స్ కోసం యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ధర్మపురి మండలం నుండి అప్పం తిరుపతి, బుగ్గారం మండలం నుండి రెంటం శ్రీధర్,వెల్గటూర్ మండలం నుండి పుదారి రమేష్, పెగడపెల్లి మండలం నుండి పురుషోత్తం అనిల్, ధర్మారం మండలం నుండి సొగల తిరుపతి,గొల్లపెళ్లి

మండలం నుండి పురంశెట్టి గౌతమ్ లను యూత్ అధ్యక్షులుగా, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడిగా ధర్మారం మండలం కి చెందిన ఆశోధ అజయ్ లను ప్రకటించారు. అనంతరం మెంబర్ షిప్స్ ప్రక్రియను లాంచనంగా ప్రారంభించారు

 

ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, ఏ పార్టీలో నైన యువత అనేది ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుందని, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి కష్టంలో నా వెంట ఉంటూ నన్ను ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ప్రస్తుతం ప్రభుత్వ విప్  హోదాలో కొనసాగడం  జరుగుతుందని, కష్ట కాలంలో నా వెంట ఉన్న ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యుడేనని అన్నారు.

యూత్ కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎవరు కష్టపడ్డారో, ఎవరు పార్టీ కోసం ఎంత పని చేశారో నాకు అన్ని తెలుసునని, కష్టపడిన ప్రతి కార్యకర్తను భవిష్యత్తులో సముచిత స్థానాల్లో ఉంచుతామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మంథని నియోజకవర్గం తర్వాత ధర్మపురి నియోజక వర్గం గురించి అడిగే స్థాయిలో పని చేయడం జరుగుతుందని, అది మీ అందరి సహాయ సహకారాల వల్లనే సాధ్యం కావడం జరిగిందని, ప్రతి మండలంలో అత్యధికంగా మెంబర్ షిప్స్ కొట్టించే బాధ్యత ప్రతి యూత్ అధ్యక్షుడిపైన ఉందని లక్ష్మణ్ కుమార్ అన్నారు.

విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన పథకాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయాల్సిన బాధ్యత యూ త్ కాంగ్రెస్ పైన ఉందని,అవకాశాలు వెత్తుకుంటూ మనం వెళ్ళడం కాదని,కష్టపడితే అవకాశాలె మన వెంట వస్తాయని,రాష్ట్ర స్థాయిలో మన ధర్మపురి నియోజకవర్గాన్ని మెంబర్ షిప్స్ లో ముందుండే విధంగా కృషి చేయాలని కోరారు.

 

Tags