గోదావరి నది పరివాహక  ప్రాంతాలను పరిశీలించిన  జిల్లా కలెక్టర్  బీ. సత్య ప్రసాద్, ఎస్పి అశోక్ కుమార్

On
గోదావరి నది పరివాహక  ప్రాంతాలను పరిశీలించిన  జిల్లా కలెక్టర్  బీ. సత్య ప్రసాద్, ఎస్పి అశోక్ కుమార్

గోదావరి నది పరివాహక  ప్రాంతాలను పరిశీలించిన  జిల్లా కలెక్టర్  బీ. సత్య ప్రసాద్, ఎస్పి అశోక్ కుమార్

జగిత్యాల సెప్టెంబర్ 02 (ప్రజా మంటలు) :

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల  నేపథ్యంలో అధికారులు  శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్,కడెం ప్రాజెక్టు ల గేట్లు ఎత్తి  నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల‌ని ముఖ్యంగా రైతులు, చేపలు పట్టేవారు, పశువుల కాపరులు నదిలోకి దిగవద్దని  కలెక్టర్ సూచించారు. ప్రజలు అధికారులకు సహకరించాలి అని తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రంతంగా ఉండాలి. ఇబ్రహీంపట్నం మండలంలోని,ఎర్ధండి, కోమటి కొండాపూర్, మూలరాంపూర్ గ్రామాల్లోని గోదావరి నది,పరివాహక. ప్రాంతాలను  చెరువులు, వాగుల కుంటలను సందర్శించారు.  జిల్లాలోని వివిధ గ్రామాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పి ప్రజలకు అధికారులు అండగా ఉంటారని, ఎలాంటి భాయాణదోళనకు గురికావద్దని, అప్రమత్తంగా ఉంది, అవసరమైనపుడు అధికార్యలకు సమాచారం చెరవేయాలని సూచించారు.

24 గంటలపాటు నీటి వనరులపై నిఘా పెట్టాలని, ముంపు ప్రాంతాల్లో అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల్ ఆర్డిఓ మరియు డిఎస్పి మున్సిపల్ కమిషనర్, టెంపుల్ ఏవో ఎమ్మార్వో ఎంపీడీవో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు

----

Tags