పసుపు బోర్డు ఏర్పాటుకు మాజీ ఎంపీ,ఎమ్మెల్సీ కవిత కృషి కారణం
పసుపు బోర్డు ఏర్పాటుకు మాజీ ఎంపీ,ఎమ్మెల్సీ కవిత కృషి కారణం
హైదరాబాద్ జనవరి 15:
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎక్కువగా కృషి చేసింది ముమ్మాటికీ బి అర్ ఎస్ నాయకురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అని బిఆర్ఎస్ నాయకులు ప్రకటించారు.
అనేక దశాబ్దాలుగా అక్కడి రైతులు పసుపుబోర్డు ఏర్పాటు చేయాలనీ కోరుతున్నారు. ఇదే విషయాన్ని అప్పుడు నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలుగా ఉన్న బి అర్ ఎస్ నాయకురాలు దృష్టికి రైతులు తీసుకువచ్చిండ్రు ! రైతులకు గిట్టుబాటు ధర రావాలి అన్న, అంతర్జాతీయ మార్కెట్లో పసుపు డిమాండ్ పెరగాలి అన్న పసుపు బోర్డు మాత్రమే పరిష్కార మార్గం అని వారు భావించి పార్లమెంట్ లో ప్రస్తావించారని, పతంజలి సంస్థ సీఈవో బాలకృష్ణను నిజామాబాద్ తీసుకొచ్చి,ఇక్కడి పంటకు గిట్టుబాటు. ధర ఒప్పించడానికి కల్వకుంట్ల కవిత కృషిచేశారని పేర్కొన్నారు.
కేంద్రప్రభుత్వానికి తగు విధంగా నివేదించి, ప్రధానమంత్రిని స్వయంగా కలసి నొక్కి చెప్పి, పసుపు పండించే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను స్వయంగా కలిసి, నిజామాబాద్ లో పసుపుబోర్డు ఏర్పాటుకు మద్దతు కూడగట్టిన ఘనత కవిత దెనని అన్నారు.
అందుకు అందుకే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులచే ప్రధానికి లేఖలు రాయించారు. పార్లమెంటులోనూ ప్రయివేటు మెంబర్ బిల్లు కు ప్రయతుంచారు.మరో వైపు పసుపు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసిండ్రు ! పసుపు తో తయారు అయ్యే వివిధ ఉత్పత్తులను తయారు చేసే పతంజలి సంస్థ వారిని సైతం సంప్రదించిండ్రు ! ఆ కంపెనీ సిఇవో బాలకృష్ణని , రామ్ దేవ్ బాబాని నిజామాబాద్ కు రప్పించారు. పసుపు బోర్డు ప్రాధాన్యతను నిజామాబాద్ రైతుల్లో ఓ నిత్య నామస్మరణగా చేసి, రైతుల్లోనూ చైతన్యం నింపి, రైతులు ఉద్యమాలు చేపట్టి, వందలాది రైతులు ఎన్నికల గోదాలోకి దిగారు
మరోవైపు దీన్ని కేంద్రం రాజకీయ కోణం లో వాడుకోవాలి అనుకున్నది ! తమ అభ్యర్థి బాండు పేపర్ మీద రాసి ఇచ్చిండు ! విశయం సున్నితంగా మారింది ! మా నాయకురాలికి పడాల్సిన ఓట్లు కాస్త అటు పడ్డవి ! వారి కృషిని జనానికి అర్థం చేయించడం లో వారి పార్టీ నాయకత్వం విఫలం ఐయింది ! వారిపై కొన్ని కుట్రలు కూడా జరిగినవి ! ఆలా ఓ సాంకేతిక ఓటమికి గురి ఐయిండ్రు ! ఏది ఏమైనా నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు అయినందున అక్కడి రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.