ధర్మపురిలో సబ్ ట్రెజరీ కార్యాలయం ఏర్పాటుకు కృషి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్మన్ కుమార్.
ధర్మపురిలో సబ్ ట్రెజరీ కార్యాలయం ఏర్పాటుకు కృషి
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్మన్ కుమార్.
గొల్లపల్లి జనవరి 15 (ప్రజా మంటలు):
ధర్మపురిలో ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజల ప్రయోజనాల కొరకు సబ్ ట్రెజరీ కార్యాలయం ఏర్పాటు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
బుదవారం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనందరావు, యాల్ల అమర్నాథ్ రెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ను కలిసి ధర్మపురిలో సబ్ ట్రెజరీ కార్యాలయం కొరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు పి ఆర్ టి యు టి ఎస్ 2025 డైరీ ని అందజేసి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి, బుగ్గారం, వెలగటూరు, ఎండపల్లి, బీర్పూర్ మండలాల ఉద్యోగ, ఉపాధ్యాయుల & ప్రజల సౌకర్యార్థం ధర్మపురిలో సబ్ ట్రెజరీ కార్యాలయం కొరకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కు ప్రతిపాదనలు పంపిస్తానని, అదే విధంగా జగిత్యాల్ జిల్లా పరిషత్ లో పెండింగ్ లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల జిపిఎఫ్ పార్ట్ ఫైనల్స్ మరియు లోన్లు బకాయిలు దాదాపు 11 కోట్ల రూపాయలు ఇప్పిస్తానని చెప్పారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలైన మూత్రశాలలు తాగునీరు కొరకు ప్రతిపాదనలు పంపించాలని వారు కోరారు. సి ఎస్ ఆర్ నిధుల ద్వారా మంజూరు చేయిస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సంఘనబట్ల దినేష్ పి ఆర్ టి యు టి ఎస్ నాయకులు దత్తాత్రి, గణేష్, శివప్రసాద్, కిరణ్, వంశీ తదితరులు పాల్గొన్నారు