గుండెపోటుతో యువకుడి హఠాన్మరణం

నివాళులు అర్పించిన ముల్కనూర్ సొసైటీ ఉద్యోగులు 

On
గుండెపోటుతో యువకుడి హఠాన్మరణం

భీమదేవరపల్లి ఆగస్టు 23 (ప్రజామంటలు) :

 

గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన భీమదేవరపల్లి మండలంలోని గట్లనరసింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అడ్డగట్ల శ్రీనివాస్ (30) అర్ధరాత్రి నిద్రలో గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. మృతుడు ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి సంఘం మార్కెటింగ్ సొసైటీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ హఠాన్మరణం మరణం పట్ల తోటి ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతకుముందు తమతో కలిసిమెలిసి పనిచేసిన సహచరుడు అర్ధరాత్రి మృతి చెందడంతో కన్నీరు మున్నీరయ్యారు.

Tags