తెలంగాణ ఆస్థిత్వాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టిన ఘనుడు రేవంత్ రెడ్డి

- జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్.

On
తెలంగాణ ఆస్థిత్వాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టిన ఘనుడు రేవంత్ రెడ్డి

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు) :

సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించాల్సిన చోట,రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్.

ఈ సందర్భంగా దావ వసంతసురేష్  మాట్లాడుతూ...

తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిష్టం ను, తెలంగాణ ఆస్తిత్వంను ఢిల్లీకి తాకట్టు పెట్టి అందరిని వంచించాడు.

నిన్న చేసిన దుర్మార్గపు పనికి నీరసన్నగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది.

సీఎం రేవంత్ రెడ్డి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి గా వ్యవహరించడం విడ్డురం.

అధికారం శాశ్వతం కాదు. అహంకారంతో తెలంగాణ ను ఆస్తిత్వను మలిచి వేసే విధంగా వ్యవహారిస్తున్నారు. 

తెలంగాణ తల్లికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు.

స్థలం నిర్ణయం చేసి మార్క్ పెట్టిన తర్వాత తల్లిని పక్కన పెట్టి, పరాయి వాళ్ళను ఇక్కడ పెట్టడం సబబు కాదు అని అందరి ఆమోదం మేరకు వేరేచోట పెట్టుకోవచ్చు.

అహంకారం అధికారం కోసం తెలంగాణ తల్లిని కాలదన్నవన్నారు.

అయన భాష చూసి అందరు అసహ్యహించుకుంటున్నారు 

కేసీఆర్ పాలనా స్వర్ణయుగం.. అయన పాలనా తీరు ఆదర్శం.

చారిత్రక కట్టడాల్లో సిద్ద హస్తులు కేసీఆర్ అని తెలంగాణ కు సీఎం కావాలి, తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి గాని తెలంగాణ తల్లి మీద మాత్రం నీకు ప్రేమ లేదు.

నాలుగు కోట్ల అభిష్టం ను వంచించిన సీఎం రేవంత్ కు తగిన బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధం అయ్యారు. సేవలు, త్యాగాలను పూర్తిగా విస్మరించారు.

అధికారం చేతిలో ఉందాని నీ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నావన్నారు.

తప్పకుండ వచ్చే ప్రభుత్వం కేసీఆర్ సీఎం అయ్యాక మీరు ఏర్పాటు చేసిన దాన్ని గంగర్పణ చేస్తామని పేర్కొన్నారు.

అదే ప్లేస్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతామన్నారు.

నిన్ను గద్దె దించి, తెలంగాణ తల్లి విగ్రహం కు పునాది వేసి, ఆవిష్కరిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దేవేందర్ నాయక్,ఆవారి శివకేసరి బాబు,పాక్స్ చైర్మన్ రాజలింగం,పట్టణ ఉపాధ్యక్షులు వొల్లెం మల్లేశం,అర్బన్ మండల అధ్యక్షుడు తుమ్మ గంగాధర్,రాయికల్ మండల మహిళా అధ్యక్షురాలు స్పందన,మాజీ ఏ ఎం సి వైస్ ఛైర్మన్లు ఆసీఫ్,బర్కం మల్లేష్,కొల్లూరి వేణు,రూరల్ మండల సమన్వయ సభ్యులు ఆనంద్ రావు,పడిగేల గంగారెడ్డి,పూదరి శ్రీనివాస్,చెట్టే గంగారాం,రాయికల్ మండల మైనార్టీ సెల్ అద్యక్షుడు చాంద్ పాషా,అర్బన్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముత్తయ్య,అర్బన్&రూరల్ మండల యూత్ కో ఆర్డినేటర్ హరీష్,అర్బన్ మండల యూత్ అద్యక్షుడు సన్హిత్ రావ్,రూరల్ మండల యూత్ ప్రధానకార్యదర్శి బాలే చందు,పట్టణ యూత్ ఉపాధ్యక్షులు ప్రణయ్,సెక్రటరీ నీలి ప్రతాప్,నాయకులు పొలస లక్ష్మి,గోవిందుపల్లె లక్ష్మి, వెంకటేశ్వర్ రావు,సాగర్ రావు,బొలిషెట్టి గంగారెడ్డి,గాజుల శ్రీనివాస్,కిషోర్,రత్నాకర్ రావు,అజయ్,నవీన్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

Tags