ఘనంగా మాజీ ప్రధాని కీ.శే రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ.

On
ఘనంగా మాజీ ప్రధాని కీ.శే రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

హైదరాబాద్ సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు) : 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ సోమవారం రాష్ట్ర రాజధాని నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అంతకుముందు వివిధ వైదిక క్రతువులు నిర్వహించి అనంతరం రాజీవ్ విగ్రహ ఆవిష్కరణతో పాటు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశం కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కు పూర్వము వైదిక పూజలు యధావిధిగా కొనసాగించి ఆవిష్కరణలో పాల్గొన్నారు.

వైదిక క్రతువులు రాజనాల.వెంకటేశ్వర శర్మ ,జగిత్యాల వాస్తవ్యులు హైదరాబాద్ నివాసులైన సిరిసిల్ల రామ శర్మ, మరియు కొరడాల విజయమోహన శర్మ తదితరులు నిర్వహించారు.

Tags